1st date salary for guest faculty

Guest faculty 1st date salary – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

BIKKI NEWS (August 01) : Guest faculty got 1st date salary in Telangana. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న 892 మంది అతిథి అధ్యాపకుల తరఫున, 1145 అతిథి అధ్యాపకుల సంఘం అధ్యక్షులు యాకూబ్ పాషా గారు, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ గారు, మరియు సంఘ సభ్యులందరి తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

Guest faculty got 1st date salary in Telangana.

మా ఉద్యోగ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన ఒక గొప్ప మార్పును మన ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రతి నెల ఒకటో తేదీన, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అతిథి అధ్యాపకులకు కూడా వేతనాలు చెల్లించడం మాకు అపారమైన ఆనందాన్ని కలిగించింది.

“అందరూ సమానమే” అనే భావనకు ప్రతిరూపంగా తీసుకున్న ఈ నిర్ణయం మా ఆత్మగౌరవాన్ని మరింత పెంచింది. సమయానికి వేతనం అందడం వల్ల మా కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఊరట పొందాయి. అతిథి అధ్యాపకుల పట్ల మన ప్రభుత్వం చూపుతున్న ఈ సానుకూల దృక్పథానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము.

మీ ఈ చారిత్రాత్మక నిర్ణయానికి తెలంగాణ రాష్ట్రంలోని 892 మంది అతిథి అధ్యాపకుల తరఫున మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా అతిథి అధ్యాపకుల సంక్షేమం, ఉద్యోగ భద్రత మరియు శ్రేయస్సు కోసం మరిన్ని సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →