BIKKI NEWS (July 14) : TG SET 2025 certificates issued start. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 కు సంబంధించి అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేత కార్యక్రమం ప్రారంభమైనట్లు కన్వీనర్ తెలిపారు.
TG SET 2025 certificates issued start
2025 డిసెంబర్ లో నిర్వహించిన ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలను 2026 మార్చిలో విడుదల చేయడం జరిగింది.
ఈ పరీక్షలలో మొత్తం 2,565 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు టెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు ఉస్మానియా యూనివర్సిటీలోని టెట్ ఆఫీసు యందు వర్కింగ్ డేస్ లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యక్షంగా వచ్చి సర్టిఫికెట్ ను పొందవచ్చు. దీని కొరకు ఎకనాలెడ్జ్మెంట్ స్లిప్ ను కచ్చితంగా తీసుకు రావాల్సి ఉంటుంది.
