Today top telugu news july 14th

Today top news in Telugu July 14th 2026 – నేటి ప్రధాన వార్తలు

Today top news in Telugu July 14th 2026 – నేటి ప్రధాన వార్తలు – తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, క్రీడా, విద్య, ఉద్యోగ వార్తల సమాహారం.

Today top news in Telugu July 14th 2026

Telangana News

బోనాల పండుగ నిధులు: తెలంగాణలో జూలై 16 నుంచి ప్రారంభం కానున్న బోనాల పండుగ కోసం 3,427 దేవాలయాలకు రూ.15.05 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

నట్టల నివారణ మాత్రల పంపిణీ: తెలంగాణలో జూలై 13 నుండి 96.81 లక్షల మంది పిల్లలకు నట్టల నివారణ (De-worming) మాత్రల పంపిణీ ప్రారంభమైంది. మిగిలిపోయిన వారికి జూలై 20న ప్రత్యేక విడతలో అందజేస్తారు.

ఆరుగురిని హత్య చేసిన షాబాద్ రాజ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు

రాష్ట్ర ప్రయోజనాలు లక్ష్యంగా డిల్లీలో పనిచేయాలని ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

గ్రత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నామని ప్రాజెక్టులను సందర్శించిన మంత్రుల బృందం తెలిపింది.

ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ ఏబీవీపీ నేడు కళాశాల బందుకు పిలుపునిచ్చింది

Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్ సీట్లు: ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 175 ఎంబీబీఎస్ (MBBS) సీట్లకు జాతీయ వైద్య కమిషన్ (NMC) ఆమోదం తెలిపింది.

నకిలీ హాల్‌మార్కింగ్ కలకలం: విజయవాడలోని ఒక జ్యువెలరీ షాప్‌పై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అధికారులు దాడి చేసి, నకిలీ హాల్‌మార్కింగ్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఏఈఈ దరఖాస్తు గడువు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) దరఖాస్తుల గడువును పొడిగించే ప్రసక్తే లేదని ఏపీట్రాన్స్‌కో (APTransco) స్పష్టం చేసింది.

నేటితో ముగుస్తున్న ఏపీ సర్ ప్రక్రియ. దరఖాస్తు గడువు పెంచాలని కోరుతున్న ఓటర్లు.

National News

2024 సి ఆర్ ఎస్ నివేదిక ప్రకారం భారత దేశ జనాభా 140 కోట్లకు చేరింది

భారత్ – అమెరికా ఒప్పందం: అమెరికాతో వాణిజ్య ఒప్పందం ‘సిద్ధంగా’ ఉందని, అయితే తులనాత్మక ప్రయోజనాల (comparative advantage) అంశంపై ఇంకా కసరత్తు జరుగుతోందని కేంద్ర వాణిజ్య కార్యదర్శి తెలిపారు.

ఉమాంగ్ (UMANG) పోర్టల్ లోపం: ఉమాంగ్ పోర్టల్‌లో ఉన్న సాంకేతిక లోపాల వల్ల వందలాది ప్రభుత్వ సేవలకు సంబంధించిన వినియోగదారుల వ్యక్తిగత డేటా బహిర్గతమైందని పరిశోధకులు కనుగొన్నారు.

సోనమ్ వాంగ్చుక్ నిరసన: సీజేపీ (CJP) నిరసనల్లో భాగంగా సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న ఉపవాస దీక్ష 16వ రోజుకు చేరుకుంది. ఆయన 8.2 కిలోల బరువు తగ్గారని, ‘ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని’ నిరసనకారుడు దిప్కే ఆందోళన వ్యక్తం చేశారు.

రామమందిర విరాళాల వివాదం: అయోధ్య రామమందిర విరాళాల ‘దొంగతనం’ వివాదంపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై నివేదిక సమర్పించాలని ఉత్తరప్రదేశ్ సిట్ (SIT) ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

జాతీయ గీతాల నిబంధన: మొదట ‘వందేమాతరం’, ఆ తర్వాతే ‘జనగణమన’ పాడాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్ర మంత్రిత్వ శాఖలకు ప్రభుత్వం మళ్లీ ఆదేశాలు జారీ చేసింది.

ఓటర్ల జాబితా సవరణ: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ప్రచురించిన ముసాయిదా జాబితాలలో దాదాపు 6.4% ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి.

International News

పశ్చిమ ఆసియా యుద్ధం: ఇరాన్ విమానం ల్యాండ్ కాకుండా నిరోధించేందుకు యెమెన్ ప్రభుత్వం సనా విమానాశ్రయంపై దాడి చేసింది. ఉద్రిక్తతలను తగ్గించాలని ఐక్యరాజ్యసమితి (UN) కోరింది.

హర్మోజ్ జల సంధి వద్ద 20% టాక్స్ వసూలు చేస్తామని ట్రంప్ ప్రకటన. అమెరికా జోక్యాన్ని సహించబోమని ఇరాన్ ప్రకటన.

Business News

సోమవారం స్వల్ప లాభాలతో మనుషుల స్టాక్ మార్కెట్లు

రూపాయి విలువ క్షీణత:bఅమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 27 పైసలు క్షీణించి 95.65 వద్ద ముగిసింది.

2006 జూన్ నెల కు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 4.33 శాతానికి చేరింది

Sports News

Lords Test – ఇంగ్లాండ్ భారత మహిళల జట్టు మధ్య జరిగిన లార్డ్స్ టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది.

ENG VS IND – నేడు ఇంగ్లాండ్ భారత్ తొలి వన్డే మ్యాచ్ ను ఆడనుంది. రోహిత్ శర్మ, కోహ్లీ బరిలోకి దిగనున్నారు

Educational and Jobs updates

తెలంగాణ టెట్ 2026 జూన్ సెషన్ ఫలితాలను విడుదల చేశారు ఫలితాల కోసం క్లిక్ చేయండి

సూర్యాపేట జిల్లాలో 131 అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది

తెలంగాణ పిసిబి రిక్రూట్మెంట్ : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) నియామకాల్లో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ గ్రాడ్యుయేట్లను మినహాయించడంపై అభ్యర్థులు అర్హత ప్రమాణాలను మార్చాలని కోరుతున్నారు. దరఖాస్తుల గడువు జూలై 17తో ముగియనుంది.

NEET UG OMR – నీట్ యూజింగ్ 2026 పరీక్షల ఓఎంఆర్ సీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు అందుబాటులో ఉంచింది

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →