Telangana anganwadi jobs vacancies 2026 - నోటిఫికేషన్ లు షురూ, అర్హతలు, ఖాళీల వివరాలు - bikki news

Telangana Anganwadi jobs Vacancies 2026 – నోటిఫికేషన్ లు షురూ, అర్హతలు, ఖాళీల వివరాలు

BIKKI NEWS (June 23) : Telangana Anganwadi jobs Vacancies 2026. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 15,982 అంగన్వాడీ టీచర్ సహాయకురాలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేశారు.

Telangana Anganwadi jobs Vacancies 2026

ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో టీచర్ పోస్టులకు, మహబూబ్ నగర్ జిల్లాలో టీచర్, ఆయా పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయిన సంగతి తెలిసిందే.

అర్హతలు : అంగన్వాడి టీచర్, సహాయకురాలు పోస్టులకు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి. ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేసే మహిళలు సంబంధిత గ్రామం, వార్డులో స్థానికులై ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ వాడకట్టులకు సంబంధిత ఎస్సీ, ఎస్టీ మహిళలు మాత్రమే అర్హులు

సహాయకురాలు పోస్టులకు ఇంటర్మీడియట్ కలిగిన అభ్యర్థులు లేకపోతే పదో తరగతి కలిగిన అభ్యర్థులను తీసుకోవచ్చు.

ఎంపిక విధానం : ఈసారి ఎంపిక విధానంలో ఇంటర్వ్యూలకు 10 మార్కులను కేటాయించారు.

ఇంటర్మీడియట్ మార్కులకు 70 శాతం వెయిటేజీ, అనాధలకు 10 శాతం, వితంతువులకు 5 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ ఉంటుంది.

జిల్లాల వారీగా ఖాళీగా వివరాలను కింద చూడవచ్చు.

జిల్లాటీచర్లుసహాయకులు
ఆదిలాబాద్182452
మంచిర్యాల110398
పెద్దపల్లి56252
భూపాలపల్లి50133
ములుగు95319
ఆదిరాబాద్176628
నిర్మల్80435
నిజామాబాద్80601
జగిత్యాల70352
కరీంనగర్56230
సిరిసిల్ల57181
సిద్ధిపేట84271
మెదక్63345
కామారెడ్డి106445
కొత్తగూడెం1921,033
ఖమ్మం136655
మహబూబాబాద్116478
వరంగల్63289
హనుమకొండ71240
సూర్యాపేట84321
నల్లగొండ148688
యాదాద్రి భువనగిరి62270
జనగామ27187
మెడ్చల్64227
హైదరాబాద్183402
రంగారెడ్డి137611
సంగారెడ్డి80416
వికారాబాద్94399
మహబూబ్‌నగర్62364
నారాయణపేట32196
గద్వాల65308
వనపర్తి47203
నాగర్‌కర్నూల్162553
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →