BIKKI NEWS (MAY 02) : Telangana cabinet meeting on May 4th 2026. తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మే 4వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటలకు జరగనుంది.
Telangana cabinet meeting on May 4th 2026
తాజా రాష్ట్ర ఉద్యోగ సంఘాల నిరసనలు, ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలు నేపథ్యంలో జరగనున్న ఈ భేటీపై ఉద్యోగ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి.
నిన్న, ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులతో మరియు ప్రభుత్వ ఉద్యోగులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయి కీలక అంశాలపై చర్చిస్తున్న సంగతి తెలిసిందే.
మే 5వ తేదీన ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా నిరాహారదీక్షకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగవ తేదీన క్యాబినెట్ సమావేశం జరగటం విశేషం.
పిఆర్సీ అమలు, పెండింగ్ బకాయిలు చెల్లింపు మీ, ఉద్యోగులకు హెల్త్ కార్డులు, ఆర్టీసీ సంస్థ, కార్మికులు ప్రభుత్వంలో విలీనం వంటి అంశాలపై ఈ క్యాబినెట్ బేటిలో నిర్ణయాలు విలువడే అవకాశం ఉంది

