హైదరాబాద్ (ఏప్రిల్ 13) : TG TET 2026 NOTIFICATION RELEASED. తెలంగాణ టెట్ 2026 రెండో సెషన్ నోటిఫికేషన్ ను ఈరోజు విడుదల చేశారు.
TG TET 2026 NOTIFICATION RELEASED
టీచర్ ఉద్యోగాల అర్హత పరీక్షగా నిర్వహించే టెట్ పరీక్ష పూర్తి నోటిఫికేషన్ ను ఏప్రిల్ 15 విడుదల చేయనున్నారు . అదే రోజు నుండి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.
దరఖాస్తు గడువు : 2026 ఏప్రిల్ 15 నుండి 30వ తేదీల మధ్య ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు వివరాలు : ఒక పేపర్ కి 750, రెండు పేపర్లకు దరఖాస్తు చేస్తే 1,000/- (ఎస్సీ, ఎస్టీ లకు ఒక పేపర్ కి 700/- , రెండు పేపర్లకు 950/- లుగా నిర్ణయం.
టెట్ హల్ టికెట్లను జూన్ 09 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
టెట్ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో జూన్ 15 నుండి 30వ తేదీల మధ్య నిర్వహించనున్నారు.
పరీక్ష సమయం ఉదయం 9.00 – 11.30 వరకు, మధ్యాహ్నం 2.00 నుండి 4.30 వరకు
టెట్ ఫలితాలను జూలై 28 – 31 వ తేదీలు మధ్య వెల్లడించనున్నారు.
ఏటా టెట్ పరీక్షలను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 2026 జనవరి నోటిఫికేషన్ విడుదల చేసి ఫలితాలు కూడా ప్రకటించారు.
అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గత టెట్ లో 57% మంది టీచర్లు టెట్ అర్హత సాధించారు. ఇంకా 30 వేల మంది టీచర్లు టెట్ అర్హత సాధించాల్సి ఉంది.
వెబ్సైట్ : Official website
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
