405 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

BIKKI NEWS (SEP. 22) : 405 Posts sanctioned in economics and statistical department. తెలంగాణ ప్రణాళిక శాఖ పరిధిలోని తెలంగాణ అర్థ గణాంక విభాగంలో 405 నూతన పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

405 Posts sanctioned in economics and statistical department.

ఈ పోస్టులలో రాష్ట్ర, మల్టీజోన్, జోనల్, జిల్లా కేడర్ పోస్టులు కలవు.

జాయింట్ డైరెక్టర్ పోస్ట్ నుండి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ వరకు మొత్తం 14 రకాల పోస్టులను మంజూరు చేయడం జరిగింది.

జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్,‌ అసిస్టెంట్ డైరెక్టర్, స్టాటిస్టికల్ ఆఫీసర్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్,, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎల్‌డీ స్టెనో,‌ టైపిస్ట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టులను మంజూరు చేయడం జరిగింది.