VIJAY – తొక్కిసలాటలో 31 మంది మృత్యువాత.!

BIKKI NEWS (SEP. 27) : 31 people killed in stampede of vijay meeting. తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌లో టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్‌.. ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా ఇప్పటివరకు 31 మంది మరణించారని తమిళనాడు పోలీసులు తెలిపారు.

31 people killed in stampede of vijay meeting.

సహాయక చర్యలు ,వైద్య సహాయం కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

చాలా మంది కరూర్ ప్రభుత్వ ఆసుపత్రి తోపాటు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు.

విజయ్ నిర్వహించనున్న మీటింగ్ లో దాదాపు 50 వేల మందికి పైగా పాల్గొన్నట్లు, మీటింగ్ జరిగిన ప్రదేశం చాలా ఇరుకుగా ఉండడం, విజయ్ ఆలస్యంగా రావడం వంటి కారణాలతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటనఫై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పీఎం నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిక వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు .

మృతుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం, క్షతగాత్రులకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం ను సీఎం స్టాలిన్ ప్రకటించారు. రేపు క్షతగాత్రులను పరామర్శ చేయనున్నారు