BIKKI NEWS (SEP. 18) : 140 Assistant and associates professor jobs in telangana. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో 140 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
140 Assistant and associates professor jobs in telangana.
వీటిలో 79 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 44 అసోసియేట్ ప్రొఫెసర్, 17 మంది ప్రొఫెసర్ల పోస్టుల నియామకాలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 450 ఖాళీలున్నాయి. అందులో అత్యధికంగా 380 సహాయ ప్రొఫెసర్లవి కాగా.. 50 అసోసియేట్, 20 ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.
అలాగే పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ పరిధిలో 111 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 86 అసోసియేట్, 52 మంది ప్రొఫెసర్ల పోస్టుల చొప్పున మొత్తం 249 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.