BIKKI NEWS (AUG. 20) : 130th Ammendment bill 2025. కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు తీవ్ర నేరారోపణ ఎదుర్కొని 30 రోజులు జైల్లో ఉంటే పదవుల నుండి తొలగించే 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టింది.
130th Ammendment bill 2025.
ఈ బిల్లు ద్వారా ప్రజాప్రతినిధులు అనగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి తో సహా తీవ్ర నేరారోపణ ఎదుర్కొని 30 రోజులపాటు జైల్లో ఉంటే 31 వ రోజు పదవి నుండి ఆటోమేటిక్ గా తొలగించే (PM REMOVAL BILL) 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.
కనీసం ఐదేళ్లు శిక్షపడే నేరాలు చేసి 30 రోజులు జైల్లో ఉండగా 31వ రోజు రాజీనామా చేయకున్న పదవి పోతుంది.
ప్రజా ప్రతినిధులు జైల్లో ఉన్నా కూడా రాజీనామా చేయకుండా ఉంటున్న నేపథ్యంలో వారిని తొలగించడానికి ఇప్పటివరకు రాజ్యాంగంలో ఎటువంటి నిబంధనలు లేవని ఈ ముసాయిదా బిల్లు తెలుపుతుంది.
అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజకీయ దురుద్దేశంతో కేసులు నమోదు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రులను తొలగించేందుకు, ప్రభుత్వాలను కూల్చివేసేందుకే ఈ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆరోపిస్తున్నాయి.