TEACHER JOBS – 13 వేల టీచర్ పోస్టుల ఖాళీలు

BIKKI NEWS (SEP. 22) : 13 Thousand teacher jobs vacancies in telangana. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 13 వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు అధికారిక సమాచారం. ఈ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.

13 Thousand teacher jobs vacancies in telangana.

ఈ మేరకు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలుమార్లు ప్రకటనలు చేశారు. అలాగే తాజాగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 1, 20,000 టీచర్ పోస్టులు ఉండగా వీటిలో లక్ష 7వేల మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం పని చేస్తున్నారు. దీంతో 13 వేల ఖాళీలు ఉన్నాయి.

తాజాగా ప్రభుత్వం కల్పించిన పదోన్నతులు వలన, రిటైర్మెంట్లు వలన ఖాళీల సంఖ్య పెరిగింది.

అలాగే ఈ విద్యా సంవత్సరం వెయ్యికి పైగా ఫ్రీ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో కూడా శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తే మరో రెండు వేల పోస్టులు పెరిగే అవకాశం ఉంది.