BIKKI NEWS (SEP. 28) : World Rabies day september 28th. ప్రపంచ రేబీస్ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 28న నిర్వహించబడుతోంది. యునైటెడ్ స్టేట్స్ లోని గ్లోబల్ అలయన్స్ ఫర్ రేబిస్ కంట్రోల్ అనే లాభాపేక్షలేని సంస్థ చేత నిర్వహించబడుతున్న ఈ దినోత్సవం రోజున రేబీస్ వ్యాధి నియంత్రణ, నివారణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కలిగిస్తారు. 2007, సెప్టెంబరు 8న తొలిసారిగా ఈ ప్రపంచ రేబిస్ దినోత్సవం జరిగింది.
World Rabies day september 28th.
ఐక్యరాజ్యసమితిచే గుర్తింపుపొందిన ఈ దినోత్సవం ప్రపంచ ఆరోగ్య సంస్థ, పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్, జంతు ఆరోగ్య ప్రపంచ సంస్థ, యుఎస్ సెంటర్స్ వంటి అంతర్జాతీయ మానవ, పశువైద్య ఆరోగ్య సంస్థలచే ఆమోదించబడింది.
లూయిస్ పాశ్చర్ జ్ఞాపకర్ధంగా ఆయన మరణించిన రోజైన సెప్టెంబరు 28న ప్రతి సంవత్సరం ప్రపంచ రేబీస్ దినోత్సవం జరుగుతుంది. లూయిస్ పాశ్చర్ తన స్నేహితుల సహకారంతో, మొదటి సమర్థవంతమైన రేబీస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాడు. మనుషులు, జంతువులపై రేబీస్ ప్రభావం గురించి అవగాహన పెంచడం, రేబీస్ వ్యాధి నివారణ చర్యలు చేపట్టడం ఈ ప్రపంచ రేబీస్ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.
One Comment on “World Rabies day – రేబీస్ దినోత్సవం”
Comments are closed.