BIKKI NEWS (SEP. 15) : WORLD OZONE DAY ON SEPTEMBER 16th అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంను ప్రతి ఏడాది సెప్టెంబరు 16న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు.
WORLD OZONE DAY ON SEPTEMBER 16th.
జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది.
సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా భూమిపై పడకుండా అందులో ఉండే అతినీలలోహిత వికిరణాలును ఓజోన్ పొర సంగ్రహించి, ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతుంది. మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం వలన ఓజోన్ పొర క్షీణించిపోతోందని 1987లో మాంట్రియల్ ప్రొటోకాల్ (ఓజోన్ పొర క్షీణతపై జరిపిన పరిశోధన) సంస్థ తెలిపింది.
WORLD OZONE DAY 2025 THEME : From Science to Global Action”
ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్ధాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్ ప్రొటోకాల్‌పై ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు 1987, సెప్టెంబర్ 16న సంతకాలు చేశాయి. ఆ తరువాత 1994, సెప్టెంబర్ 16న మరో సమావేశం జరిపి, ఓజోన్ క్షీణతను అరికట్టాలని నిర్ణయించారు. దాంతో ప్రతి సంవత్సం సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం జరపాలని నిర్ణయించబడింది.
1980లో అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ప్రొటోకాల్‌పై సంతకం చేసిన 30 సంవత్సరాల తరువాత ఓజోన్ పొరలో రంధ్ర పరిమాణం తగ్గడం గమనించబడింది.
ఓజోన్ క్షీణతకు కారణమయ్యే వాయువుల స్వభావం కారణంగా వాటి రసాయన ప్రభావాలు 50 నుండి 100 సంవత్సరాల వరకు కొనసాగుతాయి