World homeopathy day - హోమియోపతి దినోత్సవం - bikki news

World Homeopathy Day – హోమియోపతి దినోత్సవం

BIKKI NEWS (APRIL 10) : World Homeopathy Day April 10th. ప్రపంచ హోమియోపతి దినోత్సవం ప్రతి ఏటా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్‌ ఫ్రెడ్రిక్‌ సామ్యేల్‌ హనెమన్‌ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

World Homeopathy Day April 10th

హోమియోపతీ అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్యవిధానం. జర్మన్‌ దేశానికి చెందిన డా. క్రిస్టియన్‌ ఫ్రెడ్రిక్‌ సామ్యేల్‌ హనెమన్‌ అనే ఫిజిషియన్‌ 1796లో ఈ వైద్యవిధానాన్ని, ఈ మాటని కనిపెట్టాడు.

మలేరియా వ్యాధి నివారణకు సంకోనబెరడుతో చేసిన మందువాడుతారని తెలుసుకున్న హనెమన్‌ ఆ బెరడు మలేరియాను ఏ విధంగా నివారిస్తుందో తెల్సుకోవాలనుకున్నాడు. అందుకోసం సింకోనా బెరడుతో కషాయం తయారు చేసుకొని తనమీద తన స్నేహితులమీద ప్రయోగాలు జరిపి, ఏ ఔషదమైతే ఆరోగ్యవంతునిలో ఒక వ్యాధి లక్షణాలను కలుగజేస్తుందో ఆ లక్షణాలున్న వ్యాధికి ఆ ఔషదం ఇచ్చినప్పుడు వ్యాధి నయమవుతుందని తెలుసుకున్నాడు. తన ప్రయోగ ఫలితాలను గురించి 1976లో లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించడంతోపాటు, ఈ నూతన వైద్య విధానికి హోమియోపతి గా నామకరణం చేశాడు.

ప్రస్తుతం వైద్య విధానాల్లో హోమియోపతి వైద్యం రెండవ స్థానంలో ఉంది.

1813 సంవత్సరంలో జర్మనీలో టైఫాడ్‌ జ్వరం వచ్చినప్నుడు హోమియోపతి వైద్యంద్వారా ఆ వ్యాధి అరికట్టబడింది.

66 దేశాల్లో ఈ హోమియోపతి వైద్యం ప్రాచుర్యంలో వుండగా, భారతదేశ జనాభాలో 38 శాతం ప్రజలు ఈ వైద్యాన్ని పొందుతున్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →