BIKKI NEWS (NOV. 01) : WORLD AIDS DAY DECEMBER 1st. ఎయిడ్స్ దినోత్సవంను డిసెంబర్ 1వ తేదీన నిర్వహిస్తారు.
WORLD AIDS DAY DECEMBER 1st.
సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది.
ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఎయిడ్స్ వల్ల వచ్చే ఋగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం, హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక, నియంత్రించటానికి వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు.
World AIDS day 2025 Theme : Overcoming disruption, transforming the AIDS response”
ఇది హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్మ్యునోడెఫిసియెన్సీ వైరస్) అను వైరస్ వలన వస్తుంది. AIDS అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోం కు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గడం అన్నమాట. హెచ్ఐవి వైరస్ మనుషలకు మాత్రమే సోకుతుంది.
2024లో, ప్రపంచవ్యాప్తంగా 40.8 మిలియన్ల మంది HIVతో నివసిస్తున్నారని అంచనా.
2024లో దాదాపు 630,000 మంది HIV సంబంధిత కారణాల వల్ల మరణించారు.
2024 లో 1.3 మిలియన్ల మందికి HIV సోకిందని అంచనా.

