VAHANA MITRA – ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 15 వేలు

BIKKI NEWS (SEP. 16) : Vahana Mitra scheme for auto and Cab Drivers on ap. వాహనమిత్ర పథకానికి అర్హులైన ఆటో/క్యాబ్ డ్రైవర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో సెప్టెంబర్ 17 నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

Vahana Mitra scheme for auto and Cab Drivers on ap

ఇందుకోసం ప్రత్యేక ఫామ్ ను విడుదల చేసింది. అందులో వివరాలు నింపి సెప్టెంబర్ 19లోపు సచివాలయాల్లో అందజేయాలని పేర్కొంది.

ఎంపికైన డ్రైవర్లకు అక్టోబర్ నెలలో రూ.15వేల చొప్పున వారి ఖాతాల్లో నగదు జమ చేయనుంది.

వాహనమిత్ర కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

సెప్టెంబర్ 13నాటికి ఉన్న పాత జాబితాను పరిశీలిస్తారు.

కొత్తవారు ఈ నెల 17-19 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

సెప్టెంబర్ 22వ తేదీ వరకు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి 24న అర్హుల జాబితా ప్రకటిస్తారు.

అక్టోబరు 1న అకౌంట్లలో నగదు జమ చేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా 2.90లక్షల మందికి లబ్ధి చేకూరనున్నట్లు సమాచారం.