BIKKI NEWS (OCT. 24) : United Nations Day October 24th. ఐక్యరాజ్యసమితి దినోత్సవంను ప్రతి సంవత్సరం అక్టోబరు 24వ తేదీన జరుపుకుంటారు. 1947లో ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అక్టోబరు 24ను ఐక్యరాజ్యసమితి చార్టర్ యొక్క వార్షికోత్సవంగా ప్రకటించింది.
United Nations Day October 24th.
1971లో ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని అంతర్జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించింది.
ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉంటుంది .
భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా , ఫ్రాన్స్.
ఐరాస ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్.
యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని మొదటిగా అమెరికా అధ్యక్షుడు ప్రాంక్లిన్ డి, రూజ్వెల్డ్ సూచించారు. ఐక్యరాజ్య సమితి రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదాను జాన్ క్రిస్టియన్ రూపొందించారు, ఈయన దక్షిణా ఆఫ్రికాకు చెందిన వారు.
- Today in history october 3rd – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 03
- Daily GK bits in Telugu part 183 – జీకే బిట్స్
- Exam dates – అక్టోబర్ నవంబర్ నెలల్లో జరిగే పరీక్షల తేదీలు
- BRAOU part time lecturers jobs – అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో పార్ట్ టైం లెక్చరర్ జాబ్స్
- Today Gold Rate October 2nd 2026 – భారీగా పెరిగిన బంగారం ధర


Comments are closed.