BIKKI NEWS (DEC. 02) : Unauthorised absent teachers removal from service. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు చెప్పా పెట్టకుండా, అధికారికంగా సెలవు పత్రం ఇవ్వకుండా విధులకు నెల రోజులపాటు గైర్హాజరైతే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
Unauthorised absent teachers removal from service
ఉపాధ్యాయులు నెలరోజులపాటు అనుమతి లేకుండా విధులకు హాజరు కాకుంటే షోకాజ్ నోటీసు జారీ చేసి, విచారణ జరిపి, ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు గెజిట్‌లో ప్రచురించాలని డీఈఓలకు సూచించారు.
వాస్తవానికి ఒక రోజు అనధికారికంగా పాఠశాలకు రాకున్నా చర్యలు తీసుకోవచ్చని.. కాకపోతే అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డానని, రోడ్డు ప్రమాదానికి గురయ్యానని ఇలా ఏదో ఒక సాకు చూపి కోర్టుల్లో కేసులు వేస్తారన్న చర్చ జరిగింది. దాంతో నెల రోజులు చూసి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చెప్పారు.
రెండేళ్లలో 50 మంది తొలగింపు
ఏటా కొందరు టీచర్లు దీర్ఘకాలిక సెలవులపై వెళ్తుంటారు. అలాంటి వారు ఎక్కువగా విదేశాల్లోని తమ పిల్లలు, భాగస్వాముల వద్దకు వెళ్తారు. ఆరు నెలలని అనుమతి తీసుకొని ఒకటి, రెండేళ్లైనా విధులకు రాని వారున్నారు. అలాంటి వారిని గత రెండేళ్లలో సుమారు 50 మందిని ఉద్యోగం నుంచి తొలగించామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
ఇలా దీర్ఘకాలికంగా విధులకు హాజరు కానివారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఉద్యోగం నుంచి తొలగించే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు సూచించారు.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

