Ts pala - పాలిటెక్నిక్ లెక్చరర్స్ సమస్యలపై వినతిపత్రం - bikki news

TS PALA – పాలిటెక్నిక్ లెక్చరర్స్ సమస్యలపై వినతిపత్రం

  • BIKKI NEWS : 05-02-2026

TS PALA ON POLYTECHNIC LECTURERS ISSUES. పాలిటెక్నిక్ లెక్చరర్స్ సమస్యల పరిష్కారానికి TSPALA సంఘం మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణ రావును, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేనగార్లను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా లెక్చరర్స్‌కు ఇంక్రిమెంట్స్ మంజూరు, రిటైర్మెంట్ వయస్సును 65 సంవత్సరాలకు పెంచడం వంటి అంశాలపై వినతి పత్రాలు అందించడం జరిగింది.

ఈ అంశాలపై పూర్తి స్థాయిలో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చీఫ్ సెక్రటరీ గారు మరియు కమిషనర్ మేడం తెలిపారని ఉదయ్ భాస్కర్ ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా TSPALA అసోసియేషన్ నాయకులు,
రాష్ట్రంలో పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపించి, మొదటి స్థానంలో నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలకు తాము పూర్తిస్థాయిలో ప్రయత్నం చేస్తామని, లెక్చరర్స్‌గా ఇది తమ బాధ్యత అని, ప్రభుత్వం తీసుకునే ప్రతి సానుకూల నిర్ణయానికి విశాల మనసుతో సహకరిస్తామని, టెక్నికల్ ఎడ్యుకేషన్ అభివృద్ధి కోసం తమ సేవలను నిరంతరం 100% అందిస్తామని లెక్చరర్స్ తరఫున హామీ ఇచ్చారు. అలాగే ఈ అంశాలన్నింటిపై త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకునే అవకాశముందని సమావేశంలో తెలియజేశారు

ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్ రెడ్డి, TG TJAC నాయకులు చంద్రశేఖర రావు, TS PALA అధ్యక్షులు శ్రీ గోళ్ళ ఉదయ్ భాస్కర్, జనరల్ సెక్రటరీ శ్రీ టి.నవీన్ కుమార్, వుమెన్ సెక్రటరీ శ్రీమతి వి.మమత, జాయింట్ సెక్రటరీ శ్రీ ఎం.లక్ష్మణ్ రావు లు పాల్గొన్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →