BIKKI NEWS : Top GK bits in Telugu part 188 – జీకే బిట్స్
Top GK bits in Telugu part 188
1) గిర్‌గ్లాని కమిటీ నియామక ఉద్దేశం ఏమిటి.?
జ : 610 జీవో ఉల్లంఘనల పై అధ్యయన
2) ‘వీర తెలంగాణ : నా అనుభవాలు, జ్ఞాపకాలు’ అను గ్రంధ రచయిత ఎవరు?
జ : రావి నారాయణ రెడ్డి
3) మొట్ట మొదటి సారిగా భారత దేశం లో ఏ నగరం ప్రపంచ వారసత్వ నగరం గా ప్రకటించబడింది.?
జ : అహ్మదాబాద్
4) భారతదేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ని ప్రవేశపెట్టిన తేదీ.?
జ : జూలై – 1 – 2017
5) ఏ ఆల్కహాల్ తాగడం వలన గుడ్డితనం వస్తుంది.?
జ : మిథైల్ ఆల్కహాల్
6) డయాబెటిస్ మిల్లిటస్ లక్షణం ఏమిటి.?
జ : రక్తంలో ఎక్కువ షుగర్ – తక్కువ ఇన్సులిన్
7) పోర్క్ అనేది దేని మాంసము.?
జ : పంది
8) తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏ రేఖాంశాల మధ్య ఉంది.?
జ : 77°.15′ తూర్పు రేఖాంశము నుంచి 81°. 19′ తూర్పు రేఖాంశము వరకు
9) వాతావరణంలోని ఏ పోర టెలికమ్యూనికేషన్ లో ఉపయోగపడుతుంది.?
జ : ఐనో ఆవరణము
10) ఆర్థిక అభివృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే శ్రామిక శక్తి ఏమవుతుంది.?
జ : తగ్గుతుంది
11) భారత రాజ్యాంగ పీఠికలో కనిపించే పదాల వరుస క్రమము.?
జ : సర్వసత్తాక – సామ్యవాద – లౌకిక – ప్రజాస్వామ్య – గణతంత్ర.
12) విద్య ఒక శాసన అంశంగా ఏ జాబితాలో కలదు.?
జ : ఉమ్మడి జాబితా
13) లోక్ సభలో వార్షిక కేంద్ర బడ్జెట్ నెగ్గని సమక్షంలో ఏమి జరుగుతుంది.?
జ : ప్రధానమంత్రి తన మంత్రి మండలి రాజీనామా సమర్పించాలి
14) కేరళలో మత, సంఘ సంస్కరణ ఉద్యమానికి గట్టి పునాదులను వేసిన సంఘ సంస్కర్త ఎవరు.?
జ : నారాయణ గురు
15) ఆంధ్ర మహాసభ కార్యకలాపాలలో మరియు తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ముఖ్య భూమిక వహించిన వ్యక్తి ఎవరు.?
జ : రావి నారాయణరెడ్డి
16) సెప్టెంబర్ 30 – 2012 నాడు జరిగిన తెలంగాణ మార్చ్ ను ప్రముఖంగా ఏమని పిలుస్తారు.?
జ : సాగరహారం
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
17) పార్లమెంట్ లో అనుసరించే జీరో అవర్ కాలపరిమితి ఎంత.?
జ : నిర్ణీత సమయం ఉండదు
18) 2003లో 92 వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్ కు చేర్చబడిన భాషా సమూహం ఏది?
జ : బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి
19) లక్ష్య దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి.?
జ : కేరళ హైకోర్టు
20) ఏ ఆర్టికల్ ద్వారా రాజ్యం మహిళలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది.?
జ : ఆర్టికల్ 15 (3)
21) రాజ్యాంగంలోని అత్యవసర అధికారాలు ఏ దేశం నుండి గైకొనబడ్డాయి.?
జ : జర్మనీ
22) ఏ రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలను రిజర్వేషన్ల నుండి మినహాయించారు.?
జ : అరుణాచల్ ప్రదేశ్
23) శ్రీ పర్వతం అని దేనిని పిలుస్తారు.?
జ : నాగార్జున కొండ నుండి శ్రీశైలం వరకు ఉన్న పర్వతం
24) తెలంగాణ మాండలికంలో దస్తకత్ అంటే ఏమిటి.?
జ : సంతకం
25) మోదుగ పూలు ఎవరి రచన.?
జ : దాశరధి రంగాచార్య
26) గోల్కొండ కోట పై గల బురుజుల సంఖ్య ఎంత.?
జ : 87
27) హైదరాబాదులోని ఏ కట్టడం మొగల్ చక్రవర్తి ఔరంగజేబు చే పూర్తిగావించబడింది.?
జ : మక్కా మసీద్
28) ఏ నదికి తేలివాహ అనే నామాంతరం ఉన్నది.?
జ : గోదావరి
29) వెంకటరావు ఖడ్ కేఖర్ ఏ పేరుతో ప్రసిద్ధులు.?
జ : స్వామి రామానంద తీర్థ
30) 2015 లో తెలంగాణకు హరితహారం పథకాన్ని ఎన్ని కోట్ల మొక్కలను నాటి పోషించడానికి ఉద్దేశించారు.?
జ : 230 కోట్ల మొక్కలు

