Today in history october 12th – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 12

Today in history october 12th

BIKKI NEWS : Today in history october 11th – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 12

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history October 12th

దినోత్సవం

  • సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు.

సంఘటనలు

1965: 19వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
1998: ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ ప్రమాణ స్వీకారం.
1999: ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరిన రోజుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
2000: జే ఎం ఎం ముడుపుల కేసులో పూర్వపు ప్రధానమంత్రి పి వి నరసింహారావు కు, బూటాసింగుకు కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగారం, 2 లక్షల జరిమానా విధించింది. (తరువాత వీరిద్దరూ నిర్దోషులుగా బయటపడ్డారు).

జననాలు

1911: విజయ్ మర్చంట్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు .
1917: బూర్గుల రంగనాథరావు, తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, మరాఠి, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం పొందారు. వీరు పలు గ్రంథాలు రచించడమే కాకుండా ఆకాశవాణి నుంచి వీరి చాలా కథలు, నాటికలు ప్రసారమయ్యాయి.
1918: పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (మ.1986)
1929: రామినేని అయ్యన్న చౌదరి, సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు, విద్యావేత్త.
1932: యుషిరో మియురా, తన 70వ యేట, 75వ యేట, 80వ యేట ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న జపాన్‌కు చెందిన పర్వతారోధకుడు.
1936: రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, వ్యాసరచయిత.
1945: పంతుల జోగారావు, వీరి కథనశైలి సూటిగా, సరళంగా, స్వీయానుభవంలో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
1948: ప్రొతిమా బేడి, ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి. (మ.1998)
1955: హేమా చౌదరి, దక్షిణ భారత సినిమా నటి.
1955: బియ్యాల జనార్ధన్‌రావు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్. (మ. 2002)
1981: స్నేహ, తెలుగు సినీ నటి .

మరణాలు

1967: రామమనోహర్ లోహియా, సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త. భారతదేశంలోని ఇప్పటి సోషలిస్టులకు ఆదిగురువు ఆయన. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్యంగా రేడియో స్టేషను పెట్టాడు.
1993: పెండేకంటి వెంకటసుబ్బయ్య, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ గవర్నరు. (జ.1921)
2012: ఘండికోట బ్రహ్మాజీరావు, ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (జ.1922)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →