BIKKI NEWS : Today in history March 27th – చరిత్రలో ఈరోజు
Today in history March 27th
దినోత్సవం
సంఘటనలు
1998: ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనతకు ఔషధంగా ధ్రువీకరించారు.
2008: వికీపీడియాలో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడింది.
2022: ముఖేష్ సహాని బీహార్ పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ని కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు.
జననాలు
1845: విల్ హెల్మ్ కన్రాడ్ రాంట్ జెన్, ఎక్స్ కిరణాల కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, జననం. (మరణం.1923)
1903: హెచ్.వి.బాబు, తెలుగు సినిమా దర్శకుడు. సరస్వతి టాకీస్ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు సినిమాలు నిర్మించాడు
1927: రాజ్ బేగం, మెలోడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్ అని పేరుపొందిన కాశ్మీరీ గాయని. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2016)
1937: రాగిణి , చలన చిత్ర నటి, నృత్య కళాకారిణి(మ.1976)
1985: రాం చరణ్ తేజ, తెలుగు సినిమా కథానాయకుడు.
మరణాలు
1868: మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించారు. (జ.1794)
1898: సయ్యద్ అహ్మద్ ఖాన్, భారత విద్యావేత్త, రాజకీయవేత్త. (జననం.1817)
1968: యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (జననం.1934)
1985: గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (జ.1918)
2015: మనుభాయ్ పటేల్, స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది, గుజరాత్ మాజీ మంత్రి.
