BIKKI NEWS : Today in history March 26th – చరిత్రలో ఈరోజు
Today in history March 26th
దినోత్సవం
- బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం.
- మూర్ఛవ్యాధి అవగాహన దినోత్సవం
సంఘటనలు
1971 : పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్గా అవతరించింది. (బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం)
1977: భారత లోక్ సభ స్పీకర్గా నీలం సంజీవరెడ్డి పదవి స్వీకారం.
2000: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు.
2008: భూటాన్లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
జననాలు
1872: దివాకర్ల తిరుపతి శాస్త్రి, వంద సంస్కృత, తెలుగు గ్రంథాలు, నాటకములు, అనువాదాలు వ్రాశారు. (మ. 1920)
1875: మాక్స్ అబ్రహమ్, జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1922)
1912: పండితారాధ్యుల నాగేశ్వరరావు, పత్రికారచయిత, ఆంధ్రప్రభ బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్‌గా, ఈ పత్రికలతో పాటుగా గోభూమి, క్రాంతి, సంజయ, ప్రజాప్రభ వారపత్రిక, Pedestrian పత్రికలలో సంపాదకునిగా పనిచేశాడు.
1933: ఆచార్య కుబేర్ నాథ్ రాయ్, రచయిత.
1965: ప్రకాష్ రాజ్, దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు.
1972: మధుబాల, భారతీయ చలన చిత్ర నటి.
మరణాలు
1797: జేమ్స్ హట్టన్ స్కాటిష్ తత్వవేత్త, ప్రకృతి ప్రియుడు (జ.1726)
1990: బెంగుళూరు లత, కన్నడ, తెలుగు చిత్రాల గాయనీ (జ.1941)
1991: ఆర్.సుదర్శన్, సంగీత దర్శకుడు (జ.1914)
2006: అనిల్ బిశ్వాస్, రాజకీయవేత్త (పశ్చిమ బెంగాల్ సి.పి.యం రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు. (జ.1944)
2006: దుక్కిపాటి మధుసూదనరావు, తెలుగు సినీ నిర్మాత. (జ.1917)
2013: సుకుమారి, తెలుగు, తమిళ, బెంగాలీ, చిత్రాలలో,2000 పైగా నటించిన నటి (జ.1938)
2016: పూసపాటి ఆనంద గజపతి రాజు, విజయనగరం పూసపాటి రాజవంశీయుడు, మాజీ మంత్రి. (జ.1950)
