Today in history march 24th - చరిత్రలో ఈరోజు - bikki news

Today in history March 24th – చరిత్రలో ఈరోజు

BIKKI NEWS : Today in history March 24th – చరిత్రలో ఈరోజు

Today in history March 24th

దినోత్సవం

  • ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం
  • సెంట్రల్ ఎక్సైజ్ దినం

సంఘటనలు

1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
1896 చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.
1977: భారత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పదవీ విరమణ.
1977: భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు.
1997: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎ.జె.ఎం. అహ్మది పదవీ విరమణ.
1998: భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.
1998: పశ్చిమ బెంగాల్లో దంతన్ ప్రాంతంలో భయంకర టోర్నడో ఫలితంగా 250 మంది ప్రజల మరణం.3000 మంది గాయపడ్డారు.
2008: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్థిక శాఖామంత్రికి సమర్పించింది.

జననాలు

1775: ముత్తుస్వామి దీక్షితులు, భారత దేశానికి చెందిన కవి, రచయిత, వాగ్గేయకారుడు. (మ.1835)
1914: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు.
1923: టీ.ఎం.సౌందర రాజన్ , గాయకుడు, సంగీత దర్శకుడు ,(మ.2013)్
1984: ఆడ్రియన్ డీసౌజా, భారత హాకీ క్రీడాకారుడు.

మరణాలు

1603: ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I, ఇంగ్లాండు మహారాణి. (జ.1533)
1904: సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ , ఆంగ్ల రచయిత. భగవద్గీతను ఇంగ్లీషులోనికి అనువదించాడు. (జ.1832)
1963: అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది.
1971: ఎర్రమల కొండప్ప, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1867)
1991: చెరువు ఆంజనేయ శాస్త్రి , తెలుగు సినిమా సహాయ దర్శకుడు, గేయ రచయిత(జ.1926).
2016: వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.1950)
2017: గ్రంధి సుబ్బారావు వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి సంస్థ వ్యవస్థాపకుడు.
2022: అభిషేక్ ఛటర్జీ, బెంగాలీ సినిమా నటుడు. (జ.1964)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →