BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు జనవరి 02
Today in history January 2nd
దినోత్సవం
- ప్రపంచ శాంతి దినోత్సవం
- మోటివేషన్ & ఇన్స్పిరేషన్ డే
- వరల్డ్ ఇంట్రోవర్ట్ డే
- జాతీయ వైజ్ఞానిక కాల్పనిక దినోత్సవం
- నేషనల్ పెట్ ట్రావెల్ సేఫ్టీ డే
సంఘటనలు
1757 లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన రాబర్ట్ క్లైవ్ కలకత్తాను నాటి పాలకుడు సిరాజుద్దౌవుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.
1777లో అమెరికా న్యూ జెర్సీలో జనరల్ చార్లెస్ కార్న్ వాలీస్ నేతృత్వంలోని బ్రిటీష్ సైన్యం చేసిన దాడిని, జనరల్ జార్జ్ వాషింగ్టన్ నేతృత్వం లోని అమెరికన్ దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి.
1788లో యూనైటెడ్ స్టేట్స్ రాజ్యాంగాన్ని ఆమోదించిన నాల్గవ రాష్ట్రంగా జార్జియా అవతరించింది.
1818లో బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అనే సంస్థ స్థాపించబడింది.
1900వ సంవత్సరంలో చైనాతో వాణిజ్యమును ప్రోత్సహించడానికి అమెరికన్ దౌత్యవేత్త జాన్ హే “ఓపెన్ డోర్ పాలసీ”ని ప్రకటించెను.
అదే సంవత్సరం జనవరి 2న చికాగో శానిటరీ అండ్ షిప్ కెనాల్ ప్రారంభించబడింది.
1906లో ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ కండిషనర్ పేటెంట్ నీ అమెరికన్ ఇంజనీర్ అయిన విల్లిస్ క్యారియర్ పొందాడు.
1954 జనవరి రెండున భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పురస్కారాల ప్రారంభము నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ గారి చేతుల మీదుగా జరిగింది. అదే రోజున భారతరత్నతో పాటు పద్మభూషణ్ పద్మ విభూషణ్ పురస్కారాలు కూడా రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడ్డాయి.
1967లో అమెరికన్ రిపబ్లికన్ రాజకీయ నాయకుడైన రోనాల్డ్ రీగన్ కాలిఫోర్నియా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు.
1992లో జనవరి 2న ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ భారత్ తో జరిగిన మ్యాచ్ ద్వారా తన టెస్ట్ అరంగేట్రం చేశారు.
2004లో నాసా యొక్క స్పేస్ క్రాఫ్ట్ ఒకటి “స్టార్ డస్ట్ వైల్డ్ 2” అనే తోకచుక్క నుంచి ధూళిరేణువులను సేకరించింది. ఆ తర్వాత దీనిలో ముఖ్యమైన గ్లైసిన్ అనే ఎమైనో ఆమ్లం ఉన్నట్లు గుర్తించారు.
జననాలు
1902 : బి.వి . రామానందం , తెలుగు చలన చిత్ర దర్శకుడు(మ.1955).
1917: కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (మ.2010)
1918: బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణాకు చెందిన సాతంత్ర్య పోరాట యోధుడు. (మ.1946)
1920: ఐజాక్ అసిమోవ్, అమెరికన్ రచయిత, బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (మ.1992)
1927: మల్లవరపు జాన్, తెలుగు కవి. (మ.2006)
1932: ఓగేటి అచ్యుతరామశాస్త్రి, పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త.
1937: చంద్రశేఖర కంబార, కన్నడ కవి, నాటక రచయిత, సంగీత దర్శకుడు, చలనచిత్ర నిర్దేశకుడు, అధ్యాపకుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.
1937: మహారాణి చక్రవర్తి, భారతీయ అణు జీవశాస్త్రజ్ఞురాలు.
1943: మల్లు అనంత రాములు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.1990)
1957: ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2013)
1958: ఆహుతి ప్రసాద్, సినిమా నటుడు. (మ.2015)
1959: కీర్తి ఆజాద్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1960: రామణ్ లాంబా, భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (మ.1998)
1967: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (మ.2016)
1982: గోపికా పూర్ణిమ, తెలుగునేపథ్య గాయనీ
మరణాలు
1945: ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు. (జ.1864)
1969: ముప్పవరపు భీమారావు, రంగస్థల నటుడు (జ.1909)
1982: డేవిడ్ అబ్రహం, హిందీ సినిమా నటుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1909)
1983: పిలకా గణపతిశాస్త్రి, కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (జ.1911)
1992: కల్లూరి చంద్రమౌళి, స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (జ.1898)
2007: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, తెలుగు సాహితీ విమర్శకుడు. (జ.1937)
2011: గుండవరపు సుబ్బారావు, అభ్యుదయ కవి, విప్లవ గీతాల రచయిత.
2015: వసంత్ గోవారికర్, భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (జ.1933)
2016: ఎ.బి.బర్ధన్ భారత కమ్యూనిష్ఠు పార్టీ సీనియర్ నాయకుడు. (జ.1924)
2017: కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (జ.1942)
2023: ఎం. శ్రీధర్ రెడ్డి, రాజకీయ నాయకుడు, కవి, రచయిత (జ. 1945)
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
