Today in history January 1st – చరిత్రలో ఈరోజు జనవరి 01

Today in history january 1st

BIKKI NEWS : Today in history January 1st – చరిత్రలో ఈరోజు జనవరి 01

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history January 1st

దినోత్సవం

  • రహదారి భద్రతా దినోత్సవం
  • అంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం
  • సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం
  • గ్లోబల్ ఫ్యామిలీ డే

సంఘటనలు

630: ముహమ్మద్ మక్కాకు వెళ్ళి, దానిని రక్తం చిందించకుండా ఆక్రమించుకున్నాడు
1651: స్కాట్లాండ్ రాజుగా రెండో చార్లెస్ నియామకం.
1707: పోర్చుగల్ రాజుగా ఐదవ జార్జ్ నియమించబడ్డాడు.
1804: హైతీలో ఫ్రెంచి పాలన అంతమైంది.
1818: బీమా కోరేగావ్ తిరుగుబాటు (యుద్ధం) జరిగింది.
1899: క్యూబా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది
1877: ఇంగ్లాండు రాణి విక్టోరియాని భారత దేశపు మహారాణిగా వెల్లడించారు
1877: 1866 నాటి కరువులో పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి గారికి సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది.
1906: బ్రిటీషు వారు ఇండియాలో భారత ప్రామాణిక కాలమానం పాటించడం మెదలు పెట్టారు
1925: అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్, పాల పుంతకు బయట ఇతర నక్షత్ర పుంతల ఉన్నాయని వెల్లడించాడు.
1923: రామ్‌గోపాల్ మలానీ, హైదరాబాదులో డి.బి.ఆర్.మిల్స్ వ్యవస్థాపకుడు.
1939: బిల్ హెవ్లెట్, డేవిడ్ ప్యకార్డ్ కలిసి హెచ్.పి. స్థాపించారు.


1948: విభజన తరువాత భారత దేశం పాకిస్తానుకు 55కోట్ల రూపాయలను చెల్లించనన్నది
1953: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ స్థాపించబడింది.
1956: సూడాన్ స్వాతంత్ర్యం పొందింది.
1958: యూరోపియన్ కమ్యూనిటీ స్థాపించబడింది.
1960: కామెరూన్ స్వాతంత్ర్యం పొందింది
1971: అమెరికా టీవీలో ధూమపాన సంబంధిత అడ్వర్టైజెమెంట్లను బ్యాన్ చేసింది
1972: మణిపూర్‌ రాష్ట్రం అవతరించింది.
1973: ఫీల్డు మర్షల్ ఎస్.హెచ్.ఎఫ్.జె. మానెక్‌షా భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
1978: ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855, ముంబాయి సముద్ర తీరాన, అరేబియ సముద్రములోకి పడిపోయింది.

1981: గ్రీసు రిపబ్లిక్ యూరోపియన్ కమ్యునిటీలో చేరినది.
1984: బ్రూనై స్వాతంత్ర్యం పొందింది.
1985: ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది.
1986: సెన్సెక్స్, బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భార సూచీ ప్రారంభించబడింది.
1993: చెకొస్లోవేకియా చెక్, స్లోవక్ రెండు దేశాలుగా విడిపోయింది.
1994: ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) అమలులోకి వచ్చింది.
1995: GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అమలులోకి వచ్చింది.
1998: యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు స్థాపించబడింది.
1999: యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.
2002: ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.
2004: టీవీ9 తెలుగు ప్రసారాలు (ఛానెల్) మొదలు అయ్యాయి. తేది వివరాలు తెలియవు.
2006: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
2007: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.

జననాలు

1766: మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (మ.1845)
1840: బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (మ.1900)
1888: అమ్జద్ హైదరాబాదీ; తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. (మ. 1961)
1890: నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, టంగుటూరి ప్రకాశం పంతులు అనుయాయి. (మ.1978)
1892: మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (మ.1942)
1894: సత్యేంద్రనాథ్ బోస్, బెంగాలి గణిత శాస్త్రవేత్త.
1902: బస్టర్ నుపెన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (మ.1977)
1905: లంక సుందరం, భారత పార్లమెంటు సభ్యులు, అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో నిపుణులు.
1908: లీలా మిశ్రా, హిందీ చలనచిత్ర నటి. (మ.1988)
1909: చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (మ.1996)
1909: దత్తారం హింద్లేకర్, టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున వికెట్ కీపింగ్ చేసిన క్రికెటర్. (మ.1949)


1911: ఎల్లాప్రగడ సీతాకుమారి, కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు.
1920: మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయనాయకుడు. (మ.1997)
1928: మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (మ.1974)
1928: అబ్దుల్ సత్తార్ ఈది, పాకిస్థాన్‌కు చెందిన సంఘసేవకుడు, దాత. (మ.2016)
1929: ముకురాల రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.2003)
1938: గణపతి తనికైమోని భారతీయ పాలినాలజిస్ట్. (మ.1986)
1938: తిరుమల శ్రీనివాసాచార్య, గీతాలు, సాహిత్యవ్యాస సంకలనాలు, రుబాయీల రచయిత.
1939: సత్యమూర్తి, వ్యంగ్య చిత్రకారుడు.
1941: భోలేకర్ శ్రీహరి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు, శిల్పి. (మ.2018)
1942: సూర్యకళ, పాతతరం తెలుగు చలన చిత్ర నటి.పలు దక్షిణాది భాషల్లో కూడా నటించిన నటి (మ.2014)
1943: రఘునాథ్ అనంత్ మషెల్కర్, భారతీయ శాస్త్రవేత్త. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత.
1946: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు .
1946: పప్పల చలపతిరావు, ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
1948: షేక్‌ బడేసాహెబ్‌ తెలుగు రచయిత.
1948: మంచాల సూర్యనారాయణ, తెలుగు నాటకరంగ, టీవీ, సినీ నటుడు. (మ.2020)
1948: ఫగు చౌహాన్, మేఘాలయా గవర్నర్.

1951: వేణు సంకోజు, కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు.
1951: అష్ఫక్ హుస్సేన్, ఉర్దూ కవి.
1952: నానా పటేకర్, నటుడు.
1952: గౌరీ శంకర్ బైసెన్, రాజకీయ నాయకుడు. లోక్‌సభ సభ్యుడు.
1953: సల్మాన్ ఖుర్షీద్, మాజీ కేంద్రమంత్రి.
1954: శాంతా రంగస్వామి, భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి.
1954: తారాచంద్ భగోరా, భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. లోక్‌సభ సభ్యుడు.
1959: శుభా ముద్గల్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో భారతీయ గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1961: దుర్గాప్రసాద్ ఓజా, భౌతిక శాస్త్రవేత్త.
1961: ఎన్ బీరెన్ సింగ్, మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి.
1962: మారొజు వీరన్న, తెలంగాణ మహాసభను స్థాపకుడు, సి.పి.ఐ. (యం.యల్) జనశక్తి కార్యకర్త. (మ.1999)


1963: అబ్దుల్ హకీం జాని షేక్ – బాలసాహితీవేత్త.
1966: వద్దిపర్తి పద్మాకర్, పేరుపొందిన అవధాని, ఆధ్యాత్మిక ప్రవచనకారుడు.
1970:ఊహా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, చిత్రాల నటి.
1971: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (మ.2016)
1971: జ్యోతిరాదిత్య సింధియా, రాజకీయ నాయకుడు, కేంద్ర మంత్రి.
1974: కట్టా శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, కవి, కవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి.
1978: విద్యా బాలన్, హిందీ నటి.
: ఉజ్మా గొండాల్, పాకిస్తాన్ వికెట్ కీపర్, మాజీ క్రికెటర్.
1978: పరమహంస శ్రీ నిత్యానందా.
1979: డింకో సింగ్, 1998 ఆసియా క్రీడలలో బంగారుపతకం గెలుచుకున్న భారత బాక్సింగ్ క్రీడాకారుడు.


1980: మాలోతు కవిత, ఎంపీ (మహబూబాబాద్), మాజీ ఎమ్మెల్యే, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
: సానా యాదిరెడ్డి, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.
1980: తేజస్విని కొల్హాపురే, భారతీయ నటి, మోడల్.
1981: అస్మా ఫర్జాంద్, పాకిస్థాన్ మాజీ మహిళా క్రికెటర్, వికెట్ కీపర్.
1982: ఐశ్వర్య ధనుష్ భారతీయ సినీ దర్శకురాలు. భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె.
1984: సయాలి భగత్, చలన చిత్ర నటి
1987: గియా కొప్పోలా, అమెరికన్ సినిమా దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత.
1990: సోనాలి బెంద్రే, హిందీ, మరాఠీ, దక్షిణ భారత నటి, మోడల్ .
1991: శుభ్ర అయ్యప్ప, తెలుగు, తమిళ, కన్నడ, చిత్రాల నటి .
1992: డేన్ క్లీవర్, న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు.

మరణాలు

1748: జొహాన్ బెర్నౌలీ, స్విట్జెర్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త.
1775: అహమ్మద్ షా బహదూర్, 13వ మొఘల్ చక్రవర్తి. (జ.1725)
1782: జొహాన్ క్రిస్టియన్ బాక్, జెర్మనీకు చెందిన సంగీత కళాకారుడు
1894: హెన్‌రిచ్ రుడాఫ్ హెర్జ్, విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1857)
1896: విలియం డౌన్స్, న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. (జ.1843)
1940: పానుగంటి లక్ష్మీ నరసింహరావు, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)
1955: శాంతిస్వరూప్‌ భట్నాగర్‌, రసాయన శాస్త్రవేత్త. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్‌ అవార్డును ఏర్పాటు చేసారు.
1964: శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. గణితశాస్త్రవేత్త. (జ.1888)
1964: ఆల్ఫ్రెడ్ ఎవార్ట్ హాల్ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (జ.1896)
1968: వెంపటి సదాశివబ్రహ్మం, పేరుపొందిన చలనచిత్ర రచయిత
1994: చాగంటి సోమయాజులు, తెలుగు రచయిత. (జ.1915)
1995: యూగీన్ విగ్నెర్, హంగేరీకు చెందిన, నోబెల్ బహుమతి గెలుచుకున్న భౌతిక శాస్త్రవేత్త
2001: ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. (జ.1920)
2007: డూండీ, తెలుగు సినిమా నిర్మాత.
2007: టిల్లీ అల్సెన్, అమెరికన్ రచయిత్రి (జ.1912)
2008: ప్రతాప్ చంద్ర చుందెర్, భారతీయ క్యాబినెట్ మంత్రి.
2009: కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, నిరసన కవి. (జ.1947)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →