Today in history February 1st – చరిత్రలో ఈరోజు

Today in history February 1st
  • BIKK NEWS : 01-02 -2026

Today in history February 1st – చరిత్రలో ఈరోజు

Today in history February 1st

దినోత్సవం

  • భారతీయ తపాలా బీమా దినం.
  • భారత తీర రక్షక దళ దినోత్సవం
  • అంతర్జాతీయ మరణ శిక్ష వ్యతిరేక దినోత్సవం
  • సూరజ్ కుండ్ వృత్తి పనిముట్లు మేళా దినోత్సవం

సంఘటనలు

1977: భారత తీర రక్షక దళం ఏర్పాటయింది.
1996: ఐ.ఎన్.ఎస్. వజ్ర బాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే ముంబై లోని కార్యాలయం)
2003: అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది.
1986: జనరల్ కె.సుందర్జీ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
2023: 2023-24 ఆర్థిక సంవత్సారానికి భారత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.

జననాలు

1839: మార్తా స్కోఫీల్డ్
1854: అబ్బాస్ తయ్యబ్జీ, స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మాగాంధీ అనుచరుడు. (మ.1936)
1881: సిబ్లీ జాన్ “టిప్” స్నూక్, దక్షిణ ఆఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్. ఆల్ రౌండర్. (మ.1966)
1988: హెన్రీ పెక్వెట్, భారతదేశంలో మొదటి ఎయిర్‌మెయిల్ సేవలను అందించిన పైలెట్ (మ.1974)
1899: భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, భారతదేశ సుప్రీంకోర్టు ఆరవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1986)
1929: జువ్వాడి గౌతమరావు, భాషాభిమాని, సాహితీకారుడు. (మ.2012)
1932: విఠల్‌రావు దేశపాండే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. (మ.2016)
1933: వెల్చేరు నారాయణరావు, తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు.
1936: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, రచయిత, తెలుగు పండితులు. (మ.2016)
1938: ఈశ్వర్, తెలుగు సినీ పరిశ్రమలో సినిమాపోస్టర్లని డిజైన్ చేసిన కళాకారుడు. నంది పురస్కార గ్రహీత. (మ.2021)
1940: నరేంద్ర కుమార్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త, శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత. (మ.2017)
1945: బొజ్జి రాజారాం, కొంకణ్ రైల్వే మేనేజింగ్ డైరెక్టర్, వేలాడే రైలు స్కైబస్ రూపకర్త.
1951: జూలియా గ్రీన్‌వుడ్, ఇంగ్లాండుకు చెందిన మాజీ మహిళా క్రికెటర్.
1956: సుధాకర్, తెలుగు, తమిళ చలనచిత్ర నటుడు, నిర్మాత.
1956: బ్రహ్మానందం, తెలుగు చలనచిత్ర హాస్యనటుడు.
1957: జాకీ ష్రాఫ్, భారతదేశానికి చెందిన సినిమా నటుడు.
1961: నాగసూరి వేణుగోపాల్, సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, హేతువాది.
1965: అంథోనీ పీటర్ కిశోర్, అధ్యాపకులు, బైబులు ఉపదేశకులు, సమాజసేవకులు.
1971: అజయ్ జడేజా, భారత క్రికెట్ క్రీడాకారుడు.
1971: ఖలీద్ సిద్ధిఖీ, భారతదేశానికి చెందిన మోడల్, సినిమా & టెలివిజన్ నటుడు.
1984: గోపిక, భారతీయ చలనచిత్ర నటి, మోడల్
1992: వైదేహి పరశురామి, భారతీయ నటి. మరాఠీ, హిందీ చిత్రాలలో నటించింది.
1994: రమ్య బెహరా ,గాయకురాలు .
1995: జాఫర్ గోహర్, పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు.

మరణాలు

1998: మార్గా ఫాల్స్టిచ్, జర్మన్ శాస్త్రవేత్త (జ.1915)
2003: కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి, వ్యోమనౌక యంత్ర నిపుణురాలు. (జ.1962)
2009: రణబీర్ సింగ్ హుడా, భారత రాజ్యాంగ నిర్మాణసభ సభ్యుడు.
2012: విస్లావా సింబోర్స్‌కా, కవయిత్రి, అనువాదకురాలు. నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1923)
2016: ఇస్రార్ అలీ, పాకిస్థాని మాజీ క్రికెటర్. (జ.1927)
2017: జోలెపాళ్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ (జ.1925)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →