Today in history August 11th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 11

Today in history

BIKKI NEWS : Today in history August 11th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 11

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history August 11th

దినోత్సవం

  • చాద్ స్వాతంత్ర్యదినోత్సవము.

సంఘటనలు

2008: బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్‌ లో స్వర్ణపతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం రావడం భారత్‌కు ఇదే తొలిసారి
2010: విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2010-11 సంవత్సరానికి, బుధవారం ఎన్నికలు జరిగాయి.
2013: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.

జననాలు

1926: ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత, హోమియో వైద్యుడు (మ.1984).
1927: నీతా హొంటివెరోస్-లిచౌకో, ఫిలిప్పైన్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు
1949: దువ్వూరి సుబ్బారావు, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు, భారతదేశపు కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా (2008 – 2013) పనిచేశాడు.
1950: మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కృష్ణా జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్ పార్టీ నాయకుడు, నూజివీడు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడు.

మరణాలు

1908: ఖుదీరాం బోస్, భారతీయ స్వాతంత్ర్య సమర వీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు (జ.1889).
1945: త్యాగబీర్ హేమ్ బారువా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, రచయిత (జ.1893)
1946: బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు, వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో హత్య చేయబడ్డాడు (జ.1918).
1962: పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి, రచయిత, సాహితీకారుడు (జ.1900).
2000: పైడి జైరాజ్, భారత సినీరంగంలో నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (జ.1909).
2012: భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకుడు, భాషాశాస్త్ర అధ్యాపకుడు (జ.1928).
2016: యాదాటి కాశీపతి, అనంతపురం జిల్లాకు చెందిన పాత్రికేయుడు, రచయిత.
2016: ఇచ్ఛాపురపు రామచంద్రం, కథారచయిత. బాల సాహిత్య రచయిత. (జ.1940).
2018: విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్, భారత సంతతికి చెందిన వ్యక్తి, సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహిత (జ. 1932).

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →