TGPSC JLs Withheld Vacancies Selection List 2026 – విత్‌హెల్డ్ పోస్టుల ఫలితాలు విడుదల

Tgpsc jls withheld vacancies selection list 2026

BIKKI NEWS (NOV. 25) : TGPSC JLs Withheld Vacancies Selection List 2026. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఇంటర్మీడియట్ విద్యాశాఖ పరిధిలోని జూనియర్ లెక్చరర్ల (Junior Lecturers – Notification No. 22/2022) నియామకాలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. కోర్టు కేసుల కారణంగా ఇప్పటివరకు నిలిపివేసిన (Withheld) 11 జూనియర్ లెక్చరర్ ఖాళీల తాత్కాలిక ఎంపిక జాబితాను (Provisional Selection List) కమిషన్ నవంబర్ 25, 2026 న విడుదల చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

TGPSC JLs Withheld Vacancies Selection List 2026

గౌరవ హైకోర్టు W.A.No. 176 of 2026 & Batch (తేదీ: 02/04/2026) ఆదేశాల నేపథ్యంలో బోటనీ, ఇంగ్లీష్, హిస్టరీ, తెలుగు మరియు జువాలజీ సబ్జెక్టులలో పెండింగ్‌లో ఉన్న ఈ 11 పోస్టుల ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది.

సబ్జెక్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు (Total 11 Candidates)
సబ్జెక్టు & పోస్ట్ కోడ్మల్టీ జోన్ (Multi Zone)ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లుమొత్తం
బోటనీ (Botany) (Post Code-02)Multi Zone-I2202001926, 2202002068, 2202003363, 220200495905
Multi Zone-II2202005503
ఇంగ్లీష్ (English) (Post Code-13)Multi Zone-I220705981201
హిస్టరీ (History) (Post Code-16)Multi Zone-I2210085457, 221008484102
తెలుగు (Telugu) (Post Code-24)Multi Zone-I221413558202
Multi Zone-II2214124287
జువాలజీ (Zoology) (Post Code-26)Multi Zone-II221615731101
—మొత్తం ఎంపికైన వారు—11

ఇవి చదివారా :

TGPSC JLs Withheld Vacancies Selection List 2026 – ఎంపికైన అభ్యర్థులకు ముఖ్య నిబంధనలు & సూచనలు
  • కోర్టు తుది తీర్పునకు లోబడి ఎంపిక: ఈ తాత్కాలిక ఎంపిక జాబితా గౌరవ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న ఇతర రిట్ పిటిషన్ల (WPs) తుది తీర్పులకు లోబడి ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది.
  • నియామక అర్హత & ధ్రువపత్రాలు: పరీక్షలో ఉత్తీర్ణత సాధించినంత మాత్రాన నియామకపు హక్కు రాదని, నియామక అధికారి అభ్యర్థి యొక్క ప్రవర్తన, పూర్వాపరాలు (Character and Antecedents), శారీరక దృఢత్వం (Physical Fitness) మరియు నిబంధనల ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే నియామకం ఖరారవుతుందని తెలిపింది.
  • తప్పుడు సమాచారం ఇస్తే రద్దు: భవిష్యత్తులో ఏ దశలోనైనా అభ్యర్థి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలినా లేదా నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక జరిగినట్లు గుర్తించినా, వారి ఎంపికను తక్షణమే రద్దు చేయడంతో పాటు కమిషన్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
  • అధికారిక వెబ్‌సైట్: పూర్తి వివరాల కోసం అభ్యర్థులు [https://www.tgpsc.gov.in]ని సందర్శించవచ్చు.
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →