BIKKI NEWS (SEP. 18) : TGPSC APPEAL IN HIGH COURT ON GROUP 1. గ్రూప్-1 పరీక్ష ఫలితాల పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది.
TGPSC APPEAL IN HIGH COURT ON GROUP 1
సింగిల్ జడ్జి తుది తీర్పు గతంలో వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నదని ఆ పిటిషన్లో పేర్కొన్నది.
టీజీపీఎస్సీ తరఫున అదనపు కార్యదర్శి, నోడల్ అధికారి (లీగల్) ఆర్ సుమతి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో 719 మంది అభ్యర్థులు ఒకే రకమైన మార్కులు సాధించడం, అభ్యర్థుల సంఖ్యలో వ్యత్యాసంపై టీజీపీఎస్సీ ఇచ్చిన వివరణను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 14.8% మంది టాప్-500 మందిలో ఉన్నారనేందుకు ఆధారాలు లేవని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.