Telangana employees health scheme - కొత్త హెల్త్ స్కీమ్ డేటా అప్‌లోడ్‌కు డెడ్‌లైన్ ఫిక్స్! - bikki news

Telangana Employees Health Scheme – కొత్త హెల్త్ స్కీమ్ డేటా అప్‌లోడ్‌కు డెడ్‌లైన్ ఫిక్స్!

హైదరాబాద్ (మే 19) : Telangana Employees Health Scheme data upload option. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం’ (New Employees Health Scheme – EHS) అమలు దిశగా కీలక అడుగు పడింది. ఈ పథకం నిర్వహణ కోసం ప్రత్యేకంగా ‘ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్’ (EHCT) ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Employees Health Scheme data upload option

​ఈ పథకంలో భాగంగా అర్హులైన వారందరికీ హెల్త్ కార్డులు జారీ చేసేందుకు వీలుగా.. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు (పెన్షనర్లు) మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది.

​మే 31 లోపు డేటా అప్‌లోడ్ తప్పనిసరి!

​ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ విడుదల చేసిన తాజా మెమో (Memo.No.3739367-Q/113/A2/EBS.V/2026) ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని సచివాలయ విభాగాలు, శాఖాధిపతులు, పెన్షన్ మంజూరు అధికారులు, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (DDOs) తక్షణమే రంగంలోకి దిగాలని స్పష్టం చేశారు.

  • చివరి తేదీ: సంబంధిత ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలను నిర్ణీత ప్రోఫార్మాలో 31.5.2026 లోపు ఎలాంటి విఫలం కాకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • ఎక్కడ అప్‌లోడ్ చేయాలి?: DDOలు తమ వ్యక్తిగత లాగిన్ల ద్వారా IFMIS-HR మాడ్యూల్‌లో ఈ డేటాను నమోదు చేయాల్సి ఉంటుంది.

​నిబంధనల ప్రకారమే కుటుంబ సభ్యుల గుర్తింపు

​తెలంగాణ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్, 1972 లోని సెక్షన్-7 నిబంధనల ప్రకారం.. ఉద్యోగి లేదా పెన్షనర్‌పై ఆధారపడిన అసలైన కుటుంబ సభ్యుల వివరాలను మాత్రమే ఈ డేటా సేకరణలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రక్రియను అత్యంత నిశితంగా పరిశీలించాలని, డేటాలో ఎలాంటి తప్పులు లేకుండా గడువులోగా పూర్తి చేయాలని పరిపాలనా విభాగాలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా (“Most Important”) పరిగణించాలని మెమోలో స్పష్టం చేశారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →