Anganwadi jobs - 15,274 పోస్టులు - నియామక విధానం మార్పు - bikki news

Anganwadi jobs – 15,274 పోస్టులు – నియామక విధానం మార్పు

  • BIKKI NEWS : 12-02-2026

Telangana Anganwadi jobs 2026 notification soon. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,274 టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది.

Telangana Anganwadi jobs 2026 notification soon.

అతి త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గత కొంత కాలంగా పదోన్నతులు, పదవీ విరమణల కారణంగా అంగన్వాడీల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయి.

నియామక విధానంలో మార్పులు

ఈసారి నోటిఫికేషన్ ద్వారా భర్తీ విధానంలో అత్యంత పారదర్శకమైన నియామక విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం పొరుగు రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతులపై శిశు సంక్షేమ శాఖ నియమించిన కమిటీ ఇప్పటికే అధ్యయనం పూర్తి చేసి నివేదికను సమర్పించింది.

ఈ రాష్ట్రాల నివేదికలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇంటర్మీడియట్ విద్యార్హతతో పాటు ఎంపిక ప్రక్రియలో మార్పులు చేయాలని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →