Results - తెలంగాణ టెన్త్, ఇంటర్ ఫలితాల తేదీలు.? - bikki news

RESULTS – తెలంగాణ టెన్త్, ఇంటర్ ఫలితాల తేదీలు.?

BIKKI NEWS (APRIL 08) : Telangana 10th and inter exams results dates 2026. తెలంగాణ రాష్ట్ర పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల 2026 ఫలితాల విడుదలకు పూర్తిస్థాయిలో ఇంటర్మీడియట్ బోర్డ్ మరియు ఎస్ఎస్సి బోర్డులు సన్నాహాలు చేస్తున్నాయి.

Telangana 10th and inter exams results dates 2026

మొదటగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12 – 15వ తేదీల మధ్య విడుదల చేయటానికి సర్వం సిద్ధం అయ్యింది.

ఈసారి ఇంటర్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సీఎం తో జూనియర్ కళాశాలల సిబ్బంది, విద్యార్థులు, పేరెంట్స్ తో భారీ మీటింగ్ ను ఏర్పాటు చేసేశఅవకాశం కూడా ఉంది.

అలాగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 ఫలితాలను మే 4 లేదా 5వ తేదీలలో విడుదల చేసేందుకు ఎస్ఎస్సి బోర్డు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. ఇంకా సోషల్ పరీక్ష ఏప్రిల్ 13వ తేదీన నిర్వహించాల్సి ఉంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →