Standard GK bits in Telugu part 185 – జీకే బిట్స్

Standard gk bits in telugu part 185

BIKKI NEWS : Standard GK bits in Telugu part 185 – జీకే బిట్స్

Standard GK bits in Telugu part 185

1) తెలంగాణ రాష్ట్ర వార్షిక వర్షపాతం లో ఏ రుతుపవనాల వలన అధికంగా వర్షాలు పడతాయి.?
జ : నైరుతి రుతుపవనాలు

2) తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో పూర్తిగా ఎర్ర నేలలు, చల్క నేలలతో కూడి ఉంటుంది.?
జ :నల్గొండ

3) తెలంగాణ రాష్ట్ర భూగర్భ జలాల ఇయర్ బుక్ 2020- 21 ప్రకారం తెలంగాణ భౌగోళిక ప్రాంతం ఎంత మేరకు స్పటికాకార శిలలతో కప్పబడి ఉంది.?
జ :83%

4) హరిజన్ అనే పదాన్ని ఎవరు ప్రాచుర్యంలోకి తెచ్చారు.?
జ : మహాత్మా గాంధీ

5) హరిత విప్లవం సాంకేతికతతో ఏవేమి మార్పు చెందాయి.?
జ : విత్తనాలు, నీటిపారుదల, ఎరువులు

6) భారత హరిత విప్లవ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ కు వరల్డ్ పుడ్ ప్రైజ్ ఏ సంవత్సరంలో లభించింది.?
జ : 1987

7) హంటర్ కమిషన్ దేనిపై విచారణ కొరకు నియమించారు.?
జ : జలియన్ వాలాబాగ్ దుర్ఘటన

8) బంకించంద్ర ‘ఆనంద్‌మఠ్’ రచించిన సంవత్సరం ఏది.?
జ : 1882

9) రామనుజుడు ఏమి బోధించాడు.?
జ : భక్తి

10) కవిరాజు గా ఎవరు ప్రసిద్ధి చెందారు.?
జ : సముద్ర గుప్తుడు

11) పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు అసంపూర్తిగా మండడం ద్వారా ఏ వాయువు వెలువడుతుంది.?
జ : కార్బన్ మోనాక్సైడ్ (CO)

12) గంగా కార్యాచరణ ప్రణాళిక ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : 1985

13) మజూలి ద్వీపం భారతదేశంలోని ఏ నదిలో ఉంది.?
జ : బ్రహ్మపుత్ర

14) భారత దేశ వాతావరణం ఏ వాతావరణ మండల లక్షణాలను కలిగి ఉంటుంది.?
జ : ఉష్ణ మండల & సమశీతోష్ణ మండల

15) రోజ్ వుడ్ ఏ రకమైన అడవులలో కనిపిస్తుంది.?
జ : ఉష్ణ మండల సతత హరిత అరణ్యాలు

16) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రం ఏది .?
జ : హర్యానా

17) హీరాకుడ్ ఆనకట్ట ఏ నదిపై ఉంది.?
జ : మహానది

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

18) రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి మరియు సహాయం చేయడానికి మంత్రిమండలి ఉంటుందని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది.?
జ : ఆర్టికల్ 74

19) భారత పార్లమెంటులో భాగాలు ఏవి.?
జ : రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్ సభ

20) స్థానిక ప్రభుత్వ సంస్థలకు రాజ్యాంగ గుర్తింపును కల్పించాలని ఏ కమిటీ సిఫారసు చేసింది.?
జ : పీకే తుంగోన్ కమిటీ

21) మహల్వారి విధానాన్ని రూపొందించినది ఎవరు.?
జ : మెకంజి

22) బెంగాల్లో స్వదేశీ ఉద్యమ సమయంలో భరతమాత చిత్రాన్ని చిత్రించినది ఎవరు.?
జ : ఆబంద్రీనాథ్ ఠాగూర్

23) మహ్మద్ బీన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరి కి ఎప్పుడు మార్చాడు.?
జ : 1327

24) ఒక ప్రభుత్వ అధికారిని ‘నీ విధిని నీవు నిర్వహించు’ అని కోర్టు ఆదేశించడానికి ఏమంటారు.?
జ : మాండమస్

25) ఆస్తికి సంబంధించిన వివాదాలలో యదాతధ స్థితిని కొనసాగించడానికి న్యాయస్థానం ఇచ్చే ఆదేశాన్ని ఏమని అంటారు.?
జ : ఇంజంక్షన్

26) సైనిక శాసనం అమలులో ఉన్న ప్రాంతాలలోని ప్రజల ప్రాథమిక హక్కుల పరిమితులను గురించి వివరించే ఆర్టికల్ ఏది.?
జ : ఆర్టికల్ – 34

27) ఆర్టికల్ 352 ప్రకారం రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి విధిస్తే ఏ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కులు రద్దు అవుతాయి.?
జ : 358

28) ‘రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఒక చేతితో ఇచ్చి మరొక చేతితో తీసుకుందని’ ఎవరు వ్యాఖ్యానించారు.?
జ : నార్మన్ డి ఫామర్

29) టెలిగ్రామ్ ను రిట్ పిటిషన్ గా స్వీకరించవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా వ్యాఖ్యానించింది.?
జ : మోహన్ లాల్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్

30) వసంత కాల విషవత్తు ఏ రోజు ఏర్పడుతుంది.?
జ : మార్చి 21

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →