BIKKI NEWS : Standard GK bits in Telugu part 184 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
Standard GK bits in Telugu part 184
1) సముద్ర గర్భంలోనిగనులను, తల్లి గర్భంలోని శిశువును గుర్తించడానికి ఉపయోగపడే ధ్వనులు ఏవి.?
జ : అతి ధ్వనులు
2) గోల్కొండ పత్రిక ఎప్పుడు స్థాపించారు.?
జ : 1925
3) ఏ పత్రిక నిజాం ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు ప్రచురించేది.?
జ : రహబరే దక్కన్
4) దేశబంధు పత్రిక ఎప్పుడు ప్రారంభమైంది.?
జ : 1926
5) శైవమణి పత్రిక ఎప్పుడు ప్రారంభమైంది.?
జ : 1924
6) నేడు అనే పత్రిక ఏ పట్టణం నుంచి వెలువడేది.?
జ : సికింద్రాబాద్
7) తెలంగాణ నుండి వెలువడిన మొదటి పక్ష పత్రిక ఏది.?
జ : అహకాంసుబే వరంగల్
8) పయామ్ పత్రిక సంపాదకులు ఎవరు.?
జ : అబ్దుల్ గఫార్
9) భారత రాజ్యాంగం యొక్క మనఃసాక్షి ని ఏది సూచిస్తుంది.?
జ : ప్రాథమిక హక్కులు
10) సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నది పై ఉంది.?
జ : నర్మద
11) ఆవాలు ఏ కాలపు పంట.?
జ : రబీ
12) కృష్ణ, గోదావరి, కావేరి నదులను వాటి పొడవు పెరుగుతున్న క్రమంలో అమర్చండి.?
జ : కావేరి, కృష్ణ, గోదావరి
13) సింకోనా చెట్లు ఏ రకపు అడవులలో పెరుగుతాయి.?
జ : ఉష్ణ మండల సతత హరిత అరణ్యాలు
14) 30 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఒక ప్రాంతపు వాతావరణన్ని తెలియజేసే దాన్ని ఏమంటారు.?
జ : శీతోష్ణస్థితి
15) గ్లోబల్ వార్మింగ్ కు ప్రధాన కారణమైన వాయువు ఏది.?
జ : కార్బన్ డయాక్సైడ్
16) భారత పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అధికారికంగా ఎప్పుడు ప్రకటించారు.?
జ : డిసెంబర్ 2009
17) తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంగా 8 సూత్రాల ప్రణాళికను భారత ప్రధానమంత్రి ఏ సంవత్సరంలో ప్రకటించారు .?
జ :1969.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
18) 2022 – 23 విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన తొలిమెట్టు/ తొలి అడుగు కార్యక్రమం ఏ తరగతులకు సంబంధించినది.?
జ : 1 నుండి 5 తరగతులు
19) బిద్రి కళ ఉత్పత్తుల తయారీ లో ఎన్ని దశలు ఉంటాయి.?
జ : 8
20) తెలంగాణ వారసత్వ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది.?
జ : 2017
21) భారత్ లో రాజ్యాధికారానికి మూలం.?
జ : ప్రజలు
22) ప్రవేశికలో పేర్కొన్న సమానత్వం దేనికి వర్తిస్తుంది.?
జ : హోదా, అవకాశాలు
23) అష్టక సిద్దాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు.?
జ : జాన్ న్యూలాండ్స్
24) తెలంగాణ రాష్ట్రంలో త్రికూట దేవాలయం ఎక్కడ ఉంది.?
జ : హనుమకొండ
25) సంస్కృతంలోని ఐదు మహాకావ్యాలపై వ్యాఖ్యానాలు రాసిన ఒకే ఒక తెలుగు కవి ఎవరు.?
జ : మల్లినాధ సూరి
26) రాతి చెక్కడాలకు ఉపయోగించే రామడుగు శిలలు ఏ రకానికి చెందినవి.?
జ : అమృతశిలలు
27) తెలంగాణ రాష్ట్రంలో 2015 – 16 లో 30.5% ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో జననాలు 2022 నాటికి ఎంతకు చేరాయి.?
జ : 61%
28) తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల జనాభా శాతం ఎంత.?
జ : 15.45%
29) తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి ఎంత.?
జ : 988
30) సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అందించి ఆర్టికల్ ఏది.?
జ : 39A

