BIKKI NEWS (SEP. 19) : SRI KRISHNA ADITYA FAC TO TGSWREIS. ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా శ్రీ కృష్ణ ఆదిత్య సెప్టెంబర్ 17న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ గా ఉన్న శ్రీ కృష్ణ ఆదిత్య కు ప్రభుత్వం ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
SRI KRISHNA ADITYA FAC TO TGSWREIS
బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. విద్యార్థుల విద్యాప్రగతి, శిక్షణ ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలని, సమయ పాలన కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.
ఈ మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.