Sbi po 2026 notification - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - bikki news

SBI PO 2026 Notification – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1500 ఉద్యోగాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (JUNE 19) : SBI PO 2026 Recruitment notification. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

SBI PO 2026 Recruitment notification

అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి : 01-04-2026 నాటికి 21- 30 సంవత్సరాల మధ్య ఉండాలి. OBC లకు 3, SC, ST లకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం : ప్రిలిమ్స్ : 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 30, రీజనింగ్ ఎబిలిటీ – 30 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట.

మెయిన్స్ పరీక్ష : 170 ప్రశ్నలు, 200 మార్కులకు ఉంటుంది. 3 గంటలు సమయం. రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ – 40, డేటా అనలైసిస్ & ఇంటర్ ప్రిటేషన్ – 30, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంక్ నాలెడ్జ్ – 60, ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 40 చొప్పున ప్రశ్నలు ఉంటాయి.

గ్రూప్ ఎక్సర్సైజ్ – 20, ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది.

పరీక్ష తేదీలు : ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టు నెలలో, మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ నెలలో, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించనున్నారు.

దరఖాస్తు విధానం గడువు : ఆన్‌లైన్ దరఖాస్తులు 18-06-2026 నుండి 08-07-2026 వరకు చేసుకోవచ్చు.

వార్షిక వేతనం : సుమారు ₹21.97 లక్షలు

పూర్తి నోటిఫికేషన్ : Download PDF

వెబ్సైట్ : https://ibpsreg.ibps.in/sbipojun26/
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →