Sadabainama Registration – సాదాబైనామా రిజిస్ట్రేషన్ కు అవకాశం

BIKKI NEWS (SEP. 11) : sadabainama Regiseration in Telangana. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సాదా బైనామా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా వేలాది కుటుంబాలకు వారికి ఉన్న బైనామా భూములపై హక్కులు చట్టబద్ధం అవుతాయి.

sadabainama Regiseration in Telangana

ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం ప్రజలు తమ భూముల రికార్డులను సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల (SROs) లో సమర్పించుకోవాల్సి ఉంటుంది.

అవసరమైన ధృవపత్రాల పరిశీలన అనంతరం భూమిని యజమాని పేరుమీద రిజిస్ట్రేషన్ చేసే విధానం అమలు అవుతుంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా బైనామా పద్ధతిలో భూములు కొనుగోలు చేసుకున్న ప్రజలు నేడు నిజమైన యాజమానులుగా గుర్తింపు పొందనున్నారు. ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి రైతులకు ప్రత్యేక ఊరటగా భావిస్తున్నారు.

అధికారులు ప్రజలకు సూచించినట్లు, అక్రమ పత్రాలు లేదా తప్పుడు ఒప్పందాలపై అవకాశం ఉండదని హెచ్చరించారు. అన్ని రకాల ధ్రువపత్రాలతో ముందుగానే సిద్ధమై రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని కోరారు.

సాదా బైనామా రిజిస్ట్రేషన్ ముఖ్యాంశాలు

  • ఈ సౌకర్యం 2008 జూన్ 2 వరకు జరిగిన బైనా‌మాలకు వర్తిస్తుంది.
  • రైతులు, చిన్న భూస్వాములు తమ భూమిపైనా చట్టబద్ధ రిజిస్ట్రేషన్ పొందే వీలు ఉంటుంది.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్ సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.
అవసరమైన పత్రాలు :
  • బైనామా ఒప్పంద పత్రం,
  • భూ పహాణి,
  • ఆధార్,
  • రేషన్ కార్డు తదితర గుర్తింపు రికార్డులు.