Sadabainama సాదాబైనామాల‌ పరిష్కారానికి తొలిగిన అడ్డంకి.

BIKKI NEWS (AUG. 27) : sadabainama lands registration. సాదాబైనామాల‌పై ఉన్న‌ స్టేను తొలగించిన గౌరవ హైకోర్టు. ఈ తీర్పు లక్షలాది మంది పేద ప్రజల కలలను సాకారం చేయనుంది.

sadabainama lands registration

గత ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించింది కానీ 2020 ఆర్ఓఆర్ చట్టంలో ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం చూపించలేదని మంత్రి పొంగులేటి తెలిపారు. ఫలితంగా 9.26 లక్షల దరఖాస్తులు పరిష్కారం కాకుండా పోయాయని అన్నారు.

సాదాబైనామాల దరఖాస్తులను పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం నిరంతరం హైకోర్టులో కేసుకు ముగింపు లభించేలా కృషి చేసిందని ఆయన తెలిపారు.

గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో మన ప్రభుత్వం భూభారతి చట్టంలో స్పష్టమైన నిబంధనలను పొందుపరిచిందని, సాదాబైనామాల ద‌ర‌ఖాస్తుల‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తామని స్పష్టం చేశారు.

ప్ర‌జ‌లు మరియు రైత‌న్న‌ల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించేందుకు భూభార‌తి స‌ద‌స్సులు నిర్వ‌హించ‌గా 8.60 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయని, ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపించేందుకు ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందని హామీ ఇచ్చారు.