- BIKKI NEWS : 12-02-2026
Review meeting on tgipe 2026 BY sri krishna Adithya. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యామండలి (TGBIE), కమాండ్ కంట్రోల్ రూం ఇంటర్మీడియట్ విద్య మండలి హైదరాబాద్ నందు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు (DIEOs) మరియు జిల్లా పరీక్షల కమిటీ (DEC) సభ్యులతో కార్యదర్శి పరీక్షల నిర్వహణ సంసిద్దత సమావేశం నిర్వహించారు.
Review meeting on tgipe 2026 BY sri krishna Adithya.
ఈ సమావేశంలో, పరీక్షా కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా కలెక్టర్లతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని DIEOS/DEC లకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు ముందస్తుగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా పరీక్షల కమిటీలతో పరీక్షా ఏర్పాట్ల సమీక్ష అనంతరం, పరీక్షలను నిష్పక్షపాతంగా మరియు సమర్ధవంతంగా నిర్వహించేందుకు కింది ముఖ్య సూచనలు జారీ చేయబడ్డాయి:
- పరీక్షా విధులకు అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమించాలి.
- అన్ని పరీక్షా కేంద్రాలు సీసీటీవీ పర్యవేక్షణలో ఉండాలి.
- పరీక్షా సిబ్బంది వివరాలను ఖచ్చితంగా ధృవీకరించి పొరపాట్లను నివారించాలి.
- ప్రశ్నాపత్రాల భద్రతా ఏర్పాట్లు మరియు సిబ్బంది వివరాలపై జిల్లా వారీగా, కేంద్ర వారీగా తనిఖీలు నిర్వహించాలి.
- ప్రశాంతంగా మరియు ఎలాంటి అంతరాయం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు అధికారుల మధ్య సమన్వయం ఉండాలి.
విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి పరీక్షా కేంద్రంలో కింది సదుపాయాలు కల్పించేలా చీఫ్ సూపరింటెండెంట్ (CS) లను పర్యవేక్షించాలని DIEOs / DEC సభ్యులకు సూచించారు:
- ప్రతి హాల్లో గోడ గడియారం ఏర్పాటు చేయాలి.
- ప్రతి హాల్లో ఫ్యాన్లు మరియు సరైన గాలి ప్రసరణ ఉండాలి.
- పూర్తిగా పనిచేసే మరుగుదొడ్లు ఉండాలి.
- తాగునీటి సదుపాయం కల్పించాలి.
- ప్రతి విద్యార్థికి పరీక్ష రాయడానికి డ్యూయల్ డెస్క్లు ఏర్పాటు చేయాలి. విద్యార్థులను నేలపై కూర్చోబెట్టకూడదు.
పరీక్షల పారదర్శకత మరియు సమర్ధతను కాపాడేందుకు సీసీఆర్ నుండి సమగ్ర ప్రణాళికతో పాటు కలిన పర్యవేక్షణ అమలు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. పరీక్షల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పాటించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి కట్టుబడి ఉందని డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య తెలిపారు.

