BIKKI NEWS (AUG. 22) : Ration cards issue date in AP. కొత్త రేషన్ కార్డుల పంపిణీ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు శుభవార్త చెప్పింది.
Ration cards issue date in AP
నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుందని మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.
ఆగస్టు 25 నుంచి విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖ, నెల్లూరు, శ్రీకాకుళం, ప.గో, తూ.గో, కృష్ణా జిల్లాల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
ఆగస్టు 30వ తేదీ నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాలలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈసారి పంపిణి చేసే కార్డుల పై QR కోడ్ ను ముద్రించి కొత్త కార్డులు అందించనున్నారు.
సెప్టెంబర్ 06 నుంచి అనంతపురం, అల్లూరి, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాలలో పంపిణీ చేస్తారు.
సెప్టెంబర్ 15 నుంచి మిగతా జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.