BIKKI NEWS (AUG. 17) : PM YASASVI SCHOLARSHIP 2025. పీఎం యశస్వి స్కాలర్షిప్ 2025 ప్రకటన విడుదల చేశారు. 9 – 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ 1.25 లక్షల స్కాలర్షిప్ లను కేంద్రం అందిస్తుంది.
PM YASASVI SCHOLARSHIP 2025.
“పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డు స్కీం ఫర్ వైబ్రేంట్ ఇండియా” పథకం కింద ప్రతిభావంతులైన విద్యార్ధులకు టాప్ క్లాస్ స్కూల్స్ లో అభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఈ భారీ స్కాలర్షిప్ ను అందిస్తుంది.
9, 10 వ తరగతి విద్యార్ధులకు సంవత్సరానికి 75,000/-, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంవత్సరానికి 1.25 లక్షల చొప్పున స్కాలర్షిప్ ను అందిస్తుంది.
అర్హతలు: ఓబీసీ, ఈబీసీ, డీనోటిఫైడ్ గిరిజన విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్. కుటుంబ వార్షికాదాయం ఏడాదికి 2.5 లక్షల లోపు ఉండాలి.
కావాల్సిన ధృవ పత్రాలు: క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్, మార్కుల మెమో, బ్యాంక్ పాస్ బుక్.
వెబ్సైట్ : https://scholarships.gov.in/All-Scholarships