PENSION – సెప్టెంబర్ 01న పెన్షన్ విద్రోహ దినం

Pension - సెప్టెంబర్ 01న పెన్షన్ విద్రోహ దినం - bikki news

BIKKI NEWS (AUG.31) : Pension vidroha dinam on September 1st. సెప్టెంబర్ 1న తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ పెన్షన్ ఉద్రోహ దినంగా నిర్వహించాలని నిలనిర్ణయం తీసుకుంది మ. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు TGEJAC పిలుపునిచ్చింది.

Pension vidroha dinam on September 1st

పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చేపట్టనుంది.

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీముని తొలగించి పాత పెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా నిరసన రూపంలో తెలియజేయనుంది.

అలాగే సెప్టెంబర్ 8 నుండి జిల్లాలకు ఉద్యోగులు జేఏసీ బస్సు యాత్రలు చేపట్టనుంది. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో అనేక ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణను బలోపేతం చేయనుంది.

చివరిగా అక్టోబర్ 12న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అక్టోబర్ 12న 33 జిల్లాల నుండి లక్షలాదిగా ఉద్యోగులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలిరావాలని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →