OU PG One Time Chance 2027 exams – బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకునేందుకు వన్ టైమ్ ఛాన్స్

Ou pg one time chance 2027 exams

BIKKI NEWS : OU PG One Time Chance 2027 exams . ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ విద్యార్థులకు శుభవార్త. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ సబ్జెక్టులను క్లియర్ చేసుకునేందుకు యూనివర్సిటీ అధికారులు మరో అవకాశం కల్పించారు. ఈ మేరకు అర్హులైన విద్యార్థులకు వన్ టైమ్ ఛాన్స్ (One Time Chance) నోటిఫికేషన్ విడుదల చేశారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

OU PG One Time Chance 2027 exams

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న పీజీ పీజీ సెంటర్లు, అనుబంధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. 1991-92 విద్యా సంవత్సరం నుంచి 2020-21 విద్యా సంవత్సరం వరకు వివిధ బ్యాచ్‌లకు చెందిన అర్హులైన విద్యార్థులు తమ పెండింగ్ బ్యాక్‌లాగ్ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించారు.

జనవరి, ఫిబ్రవరి 2027లో పరీక్షలు

వన్ టైమ్ ఛాన్స్ కింద నిర్వహించే పరీక్షలు 2027 జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరగనున్నాయి. దీంతో గతంలో వివిధ కారణాలతో డిగ్రీ పూర్తి చేయలేకపోయిన పీజీ విద్యార్థులకు తమ విద్యార్హతను పూర్తిచేసుకునే అవకాశం లభించనుంది.

దరఖాస్తుల గడువు.. ముఖ్యమైన తేదీలు

వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.

  • ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30
  • రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 14
  • ప్రతి పేపర్ పరీక్ష ఫీజు: రూ.500
  • పరీక్షల నిర్వహణ: జనవరి/ఫిబ్రవరి 2027

అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

చాలా సంవత్సరాలుగా బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు మిగిలిపోయిన విద్యార్థులకు ఈ వన్ టైమ్ ఛాన్స్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది. అర్హత కలిగిన విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా నిర్ణీత గడువులోగా పరీక్ష దరఖాస్తులు సమర్పించి, పెండింగ్ సబ్జెక్టులను క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →