BIKKI NEWS (FEB. 24) : No One minute late rule in intermediate exams 2026.. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 లో ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించి నిబంధన గత విద్యా సంవత్సరంలో తొలగించిన సంగతి తెలిసిందే. ఐదు నిమిషాల వరకు హాజరు కావచ్చని గత పరీక్షల సమయంలో బోర్డు ప్రకటించింది.
No One minute late rule in intermediate exams 2026
ఈసారి కూడా అదే నిబంధన అమలులో ఉన్నట్లు సమాచారం. ఒక్క నిమిషం ఆలస్యమైతే అనుమతించవద్దు అంటూ బోర్డు ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో విద్యార్థులను ఒక్క నిమిషం నిబంధన అంటూ పరీక్షలకు అనుమతించని ఇబ్బంది విద్యార్థులకు లేదు.
అయితే మరీ ఆలస్యంగా వస్తే అనుమతించే విషయంపై పై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకునే అధికారం సిఎస్, డిఓ లకు ఉంటుంది.
ఒక్క నిమిషం నిబంధన లేదు అని విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించకుండా పరీక్షా కేంద్రానికి అర్థ గంట ముందే చేరుకొని తమకు కేటాయించిన రూములలో కూర్చోవడం ద్వారా హడావుడి లేకుండా పరీక్షను ప్రశాంతంగా రాయవచ్చు.
కావున తల్లిదండ్రులు విద్యార్థులను వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రాలకు తీసుకురావడానికి ప్రయత్నించాలి.
ట్రాఫిక్ ఉండే నగరాలలో వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రం వద్దకు చేరుకొని ఉండటం ఉత్తమం. హాల్ టికెట్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ సహాయంతో పరీక్షా కేంద్రాలను ఒకరోజు ముందుగానే చేరుకొని చూసుకోవడం ద్వారా చివరి నిమిషంలో పరీక్షా కేంద్రానికి దారి తెలియని స్థితి నుండి బయటపడవచ్చు.

