BIKKI NEWS (SEP. 15) : National Engineers day september 15th. జాతీయ ఇంజనీర్ల దినోత్సవము మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి రోజైన సెప్టెంబరు 15న జరుపుకుంటారు.
National Engineers day september 15th.
సుప్రసిద్ధ ఇంజనీర్, పండితుడు, ప్రముఖ అధికారి, 1912 నుండి 1919 వరకు మైసూర్ దివాన్ గా పనిచేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962) గౌరవార్థం, ఆయన జయంతిని జాతీయ ఇంజనీర్ల దినోత్సవముగా జరుపుతారు.
ఈయన భారతదేశంలో అనేక నదులపై ఆనకట్టలు, వంతెనలు కట్టి నీటిపారుదల, త్రాగునీరు పథకాల ద్వారా జలవనరుల సద్వినియోగానికి అంతర్జాతీయంగా పేరుపొందాడు.
ఈయనకు పేరు తెచ్చిన పథకాలలో కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట, దానికి ఆనుకొని వున్న బృందావన ఉద్యానవనం, భద్రావతి ఇనుము, ఉక్కు కర్మాగారం, మైసూర్ చందనపునూనె కర్మాగారం, బ్యాంక్ ఆఫ్ మైసూరు స్థాపన ముఖ్యమైనవి.
ఆయనను కర్ణాటక పితామహుడు అని అంటారు. బ్రిటిషు ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1955 లో భారత దేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రధానం చేశారు.