Gjc wargal

GJC WARGAL – వర్గల్ కళాశాల ప్రిన్సిపాల్ గా నర్సిరెడ్డి బాధ్యతలు స్వీకరణ

వర్గల్ (మార్చి 30) : Narsireddy Assumes Charge as Principal of GJC Wargal. సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వర్గల్ నూతన ప్రిన్సిపాల్ గా బి. నర్సిరెడ్డి గారు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.

Narsi Reddy Assumes Charge as Principal of GJC Wargal

కళాశాల అధ్యాపకులు నాన్ టీచింగ్ సిబ్బంది సమక్షంలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది.

తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్ గా పదోన్నతులు కల్పించిన సంగతి తెలిసిందే.

ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బి. నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ … ప్రభుత్వ జూనియర్ కళాశాల వర్గల్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ముఖ్యంగా అడ్మిషన్ల సంఖ్య పెంచడం, విద్యార్థులను సరైన మార్గంలో నడిపి ఉజ్వల భవిష్యత్తు కల్పించడం, మంచి ఫలితాలు సాధించడం పట్ల దృష్టి కేంద్రీకరించి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొని నూతన ప్రిన్సిపాల్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →