BIKKI NEWS (APRIL 18) : MPTC ZPTC ELECTIONS 2026 MAY. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను మే మాసంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కీలక సమాచారం. ఈ మేరకు తాజాగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
MPTC ZPTC ELECTIONS 2026 MAY.
నియోజకవర్గలాలో నూతన ఓటర్ల వివరాలను జత చేసి నూతన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నూతన ఓటర్ల జాబితా ఆధారంగానే ఎంపిటిసి ,జడ్పిటిసి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
నూతన ఓటర్ల జాబితాలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే ఏప్రిల్ 23వ తేదీ లోపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. తదనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయమంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 566 జెడ్పిటిసి స్థానాలు, 566 ఎంపీపీ స్థానాలు, 5773 ఎంపీటీసీ స్థానాలకు కలవు.
2025 సెప్టెంబర్ 29న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు నోటిఫికేషన్లు ఇవ్వగా, అక్టోబర్ 9న హైకోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎన్నికల నిర్వహణ నిలిపివేసింది.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
