BIKKI NEWS (DEC.25) : Intermediate hall tickets 45 days before exams. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో 45 రోజుల నుంచి రెండు నెలల ముందే తల్లిదండ్రుల వాట్సప్ నకు వారి పిల్లల హాల్ టికెట్లను పంపనున్నారు.
Intermediate hall tickets 45 days before exams.
హాల్ టికెట్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామాతో పాటు ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందో తల్లిదండ్రులకు తెలియజెప్పడమే ప్రధాన ఉద్దేశమని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు
సెకండీయర్ హాల్ టికెట్లపై ఫస్టియర్ మార్కులకు సంబంధించిన ఆన్లైన్ లింక్ ఇస్తారు. దీని వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలు ఫస్టియర్ మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు.
గతేడాది వరకు ప్రశ్నపత్రాలను ముద్రించి… ప్రింటర్ నుంచి ఇంటర్ బోర్డుకు, అక్కడి నుంచి జిల్లా కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించేవారు. దీనివల్ల కొన్నిసార్లు ప్రశ్నపత్రాల బండిళ్లు తారుమారయ్యేందుకు అవకాశముండేది.
ఈసారి ప్రింటర్ నుంచి నేరుగా జిల్లా కేంద్రాలకే తరలిస్తారు. ప్రశ్నపత్రాలను తరలించే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు.

