BIKKI NEWS (SEP. 10) : INTERMEDIATE ADMISSIONS DATE EXTENDED. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ అడ్మిషన్ల కొరకు మరో అవకాశాన్ని కల్పించింది.
INTERMEDIATE ADMISSIONS DATE EXTENDED
2025 – 26 విద్యా సంవత్సరం కొరకు ఫస్టీయర్ లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 11, 12 వ తేదీల్లో అడ్మిషన్లు తీసుకోవడానికి జూనియర్ కళాశాలలకు అవకాశం ఇచ్చింది.
ప్రైవేట్ జూనియర్ కళాశాలలో 500 రూపాయల ఆలస్య రుసుముతో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అడ్మిషన్లు పొందవచ్చు.
కావున ఇప్పటికీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందని విద్యార్థులు మీ అవకాశాన్ని ఉపయోగించుకొని అడ్మిషన్లు పొందవచ్చు.